ఎంపీ నిధుల కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలి
: జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపండి
:అనంతపురము ఎంపీ తలారి రంగయ్య
యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి:హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
అనంతపురము,మే,26 :అనంత జనశక్తి న్యూస్
ఎంపీ నిధుల కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి ఆదేశించారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫెరెన్సు హాల్ నందు అనంతపురం పార్లమెంట్ సభ్యులు టి.రంగయ్య,హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంపీ ల్యాడ్స్ పనుల పైన సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశము నిర్వహించారు.ఈ సమావేశంలో సి.పి.ఓ ఎంపీ ల్యాడ్స్ కు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను గౌరవ ఎంపీలకు, జిల్లా కలెక్టర్, ఇతర ఏజెన్సీలకు వివరించారు.అనంతరం ఎంపీ నిధుల కింద వివిధ ఏజెన్సీలు చేపట్టిన పనులపురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమి మాట్లాడుతూ, అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో రూ.14.49 కోట్ల విలువతో మజూరు అయిన 121 పనులకు గాను 48 పనులు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు., 58 పనులు పురోగతిలో ఉన్నవని మిగిలిన,15 పనులు ఇంకా మొదలు కాలేదన్నారు .అందరు ఏజెన్సీలు ప్రగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని,ఇంకా మొదలుకాని పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. అలాగే హిందూపురం పార్లమెంటరీనిధులకు సంబంధించికూడా రూ.4.55 కోట్ల విలువతో మoజూరు అయిన 88 పనులకు గాను 48 పనులు మాత్రమే పూర్తయినట్లు, 23 పనులు పురోగతిలో ఉందని,ఇంకా మొదలుకాని 9 పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించినారు. ఎంపీ నిధులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేసేందుకు వివరాలు ఇవ్వాలని సి.పి.ఓ.ను ఆదేశించినారు. అందరూ ఏజెన్సీలు నిబంధనల ప్రకారము పనులు పూర్తి చేయాలన్నారు. సోమవారం నాటికి సంబంధిత ఏజెన్సీలు ఎస్టిమేట్లను పంపాలన్నారు పంచాయతీ రాజ్ కు సంబంధించిన డిఇలు తమ ఈఈలతో సమావేశాన్ని నిర్వహించి శనివారం సాయంత్రం నాటికి వివరాలను అందించాలన్నారు
*నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపండి*
*:అనంతపురము ఎంపీ తలారి రంగయ్య
అనంతపురముఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, ఇది వరకే ప్రతిపాదించిన స్మశాన మరియు భవననిర్మాణాలకు ప్రాధాన్యత నివ్వాలని,అందుకు సంబంధించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.వర్షాకాలం వస్తునందున వెంటనే ఆ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఏజెన్సీలను కోరారు. ప్రత్యేకించి స్మశానవాటికలలో ప్రహరీ గోడలు,గేట్లు,ఆర్చి నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలన్నారు. అలాగే కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి :హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, ఎంపీ నిధుల కింద చేపట్టిన అన్ని పనులును యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేయాలని ఏజెన్సీలను కోరారు.ఈ సమావేశములో అందరూ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు యస్.ఇ పి.ఆర్, యస్.ఇ ఆర్డబ్ల్యూఎస్, యస్.ఇ ఏపీఎస్పీడీసీఎల్ , పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, గుంతకల్లు, రాయదుర్గం మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులు,తదితరులు హాజరయ్యారు.