పారదర్శకంగా పని చేయండి…
నూతన వాలంటీర్ లకు ఎమ్మెల్యే అనంత సూచన
అనంతపురం, సెప్టెంబర్ 01 ;అనంత జనశక్తి న్యూస్
కుల,మతాలకు,పార్టీలకు అతీతంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా ఎంపికైన 34 మంది వాలంటీర్ లకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. శుక్రవారం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా సచివాలయాలకు నూతనంగా ఎంపికైన వాలంటీర్ లకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నియామక పాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఇంటి ముంగింటికే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందించి,ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ,వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఎలాంటి ఒత్తిడు లకు తల వంచకుండా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ ఫలాలు అందించాలని సూచించారు. అనంతరం రహమత్ నగర్ కు చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన పింఛన్ ను అందించారు. కార్యక్రమంలో వైయస్సార్ సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు సైఫుల్లా బేగ్, వైయస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణా, డివిజన్ కన్వీనర్ సుకేశ్, కార్పొరేటర్ హసీనా బేగం, మున్సిపల్ సిబ్బంది సంగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.