మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
—- అభివృద్ధి అంటే జగన్… జగన్ అంటే అభివృద్ధి
—— రాష్ట్ర మంత్రి ఉష శ్రీచరణ్
శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 03,అనంత జనశక్తి న్యూస్:
మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. శనివారం పెనుకొండ నియోజకవర్గం లోని సొమందేపల్లి మండలంలోని నడిం పల్లి, కేతగాని చెరువు, ఈదుల బాలాపురం, బ్రాహ్మణ పల్లి, పందిపర్తి గ్రామాలలో ఆమె పర్యటించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్, జగన్ అంటే అభివృద్ధి గుర్తుకు వస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నా ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంచాయతీలలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల భవనాలు, నాడు నేడు కింద ప్రాథమిక పాఠశాలలు, వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్న అన్ని వర్గాల ప్రజలను పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నారని కొనియాడారు. పెనుకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలందరినీ కలుస్తామన్నారు. రాబోవు ఎన్నికల్లో పెనుకొండ గడ్డ పై వైఎస్సార్సీపీ జెండా ఎగురువెద్ధమని కోరారు. విబేధాలు వీడి ఇక్యమత్యంగా కలిసి పనిచేద్దామని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు . జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి వైసిపి పార్టీకి పట్టం కట్టాలని ఆశా బావం వ్యక్తం చేశారు. ఆత్మీయ పలకరింపులో ఆమె వెంట రమాకాంత్ రెడ్డి, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, జెడ్పిటిసి అశోక్, కన్వీనర్ నారాయణ రెడ్డి, సర్పంచ్ లు లలితమ్మ, రామాంజినేయులు, రామక్క, మమత, జిలాన్, యర్రమ్మ, ఎంపీటీసీ లు నాగప్ప, పూజారి ఈశ్వరయ్య, పరందమ, నాయకులు ఎల్లారెడ్డి, నరసింహమూర్తి, గజేంద్ర, ఆదినారాయణ రెడ్డి, రఫిక్, సదానంద, శ్రీనివాసరెడ్డి , నాగభూషణరెడ్డి, పుప్పం సుధాకర్ రెడ్డి , దిలీప్ రెడ్డి, గుడిపల్లి కళ్యాణ్, జగదీష్ రెడ్డి, లక్ష్మీనరసప్ప, అమరప్ప తదితరులు లు పాల్గొన్నారు.