సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే పోలీసు ధ్యేయం
ప్రజల మొబైల్ ఫోన్లలో ఫ్రీగా వైరస్ తొలగించి డాటాను సురక్షితం చేయాలని సరికొత్త పోలీసు సేవలు
అనంతపురంలో మొబైల్ హెల్త్ చెకప్ క్యాంపు ప్రారంభం…నిర్వహణ
ముఖ్య అతిథులుగా అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీలు
అనంతపురం జూన్ 01,అనంత జనశక్తి ప్రతినిధి
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే పోలీసు ధ్యేయమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ అమ్మిరెడ్డి వెల్లడించారు. అనంతపురంలోని క్లాక్ టవర్ సమీపంలో జిల్లా పోలీసుశాఖ ఈరోజు నిర్వహించిన ” మొబైల్ హెల్త్ చెకప్ క్యాంపు” ను జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు తో కలసి డి.ఐ.జి ప్రారంభించారు. ప్రజల మొబైల్ ఫోన్లలో అనుకోకుండా ప్రవేశించిన వైరస్ ను ఫ్రీగా తొలగించి డాటాను సురక్షితం చేయాలనే సంకల్పంతో ఈ సరికొత్త పోలీసు సేవలను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.ఐ.జి ఈసందర్భంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే…
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికీ మొబైల్ ఫోన్ అవసరం. ఫోన్ వాడే సమయంలో ఒక్కోసారి తెలియకుండా వైరస్ చొరబడి విలువైన డాటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోయి అనేక మోసాలు జరిగే వీలుంది. ఈనేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజల మొబైల్ ఫోన్లలోని వైరస్ తొలగించడం… వారి డాటాను సురక్షితం చేయాలని మొబైల్ హెల్త్ చెకప్ క్యాంపు ఏర్పాటు చేశాం. మొబైల్ ఫోన్ , లాప్ టాప్, కంప్యూటర్ , తదితర ఎలెక్ట్రానిక్ వస్తువులు వాడే సమయంలో అనుకోకుండా మాల్ వేర్ వచ్చే అవకాశముంది. దాని వల్ల సిస్టం స్లోగా నడుస్తుంది. ఒక్కోసారి హ్యాక్ కూడా కావచ్చు. వైరస్ చేరిందనని గుర్తిస్తే తొలగించవచ్చు. ఒక్కోసారి కనపడకుండా వైరస్ చేరుతుంది. అలాంటి సందర్భాలలో ఏమైనా అనుమానాలు ఉంటే సైబర్ కవచ్ ద్వారా మొబైల్ హెల్త్ చెకప్ పోలీసుల ద్వారా ఫ్రీగా చేయించుకునే వెసలుబాటు కల్పించాం. ప్రజలందరూ వినియోగించుకోండి. ఇక్కడ తెలుసుకున్న అంశాలను మీ మిత్రూలు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ప్రతీ సోమవారం స్పందనకు వచ్చే పిటీషనర్లు, వారి సహాయకులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మున్ముందు ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ సరికొత్త సేవలు గురించి అవగాహన చేయనున్నాం. గ్రామ మహిళా పోలీసుల ద్వారా క్షేత్ర స్థాయికి తీసికెళ్లి ప్రజలకు అవగాహన చేస్తామని డి.ఐ.జి తెలియజేశారు
మొబైల్ లో వైరస్ ఫ్రీ చేయడానికి నాలుగు కౌంటర్లు
ఈ క్యాంపు నందు మొబైల్ లో వైరస్ ఫ్రీ చేయడానికి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లను స్కాన్ చేసి వైరస్ లను గుర్తించడంలో సుశిక్షితులైన సిబ్బంది… సిస్టంలు, వీటికి పెద్ద టి.విలను అనుసంధానించి డిస్ప్లే ఉంచారు. వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ కళాశాలల విద్యార్థులు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వీరి మొబైల్స్ ప్రత్యేక కౌంటర్ల వద్ద స్కాన్ చేయించి వైరస్ లు తొలగించుకోవడం మరియు ఒకే మొబైల్ నంబర్ తో వేర్వేరుగా ఎవరొ దొంగగా వాడుతున్న విషయాలు వెల్లడయ్యాయి.ఇలా నివృత్తి చేసుకోవచ్చు : మొబైల్ వాడేటప్పుడు మీకు తెలియకుండానే వైరస్ ప్రవేశించినట్లు అనుమానమున్నా… లోన్ యాప్స్ ఇన్స్టాల్ సమయంలో డేటాను సైబర్ నేరస్తులు తస్కరించి ఉన్నారని భావించినా… ఒకే ఐ.డి ప్రూప్స్ ద్వారా రెండో సిమ్ ను ఎవరైనా దొంగచాటుగా వాడుతున్నారని సంకించినా… వాట్సాప్ ను హ్యాక్ చేశారని సందేహమున్నా… ఇలాంటి సమస్యలకు నివృత్తి చేసుకోవచ్చన్నారు.ఈకార్యక్రమంలో డి.ఐ.జి తో పాటు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు , అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఎ.హనుమంతు, అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి, సి.ఐ లు శివరాముడు, కత్తి శ్రీనివాసులు, ప్రతాప్ రెడ్డి, వెంకటేష్ నాయక్ , ఎం ఎస్ ఎం టెక్నాలజీ ఎం.డి మణికంఠ గౌతం, టెక్నికల్ వింగ్ ఎస్సై సుధాకర్ యాదవ్ , ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు