Search
Close this search box.
Search
Close this search box.

ప్రతిపక్ష నాయకులకు ఉన్మాదం ఎక్కువైంది

ప్రతిపక్ష నాయకులకు ఉన్మాదం ఎక్కువైంది

చంద్రబాబు అధికారంలోకి రావాలని ఓ ముఠా ప్రజల్ని రెచ్చగొడుతోంది

గత ప్రభుత్వం నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలకు ఎందుకు చెప్పుకోవట్లేదు

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఎల్లో మీడియాపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌

పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాల్లో పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే విషయం ఏముందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షణ్‌లో పవన్‌ నటిస్తున్నారన్నారు. సోమవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో నిజంగా ప్రజలకు మంచి పనులు చేసి ఉంటే.. వాటిని చెప్పుకుని ప్రచారం చేశావారని ఆయన అన్నారు. ఇప్పటికైనా గతంలో వారు చేసిన మంచి ఏంటో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ది లేదా పరిపాలన పరంగా ఏ విధమైన మార్పులు తెచ్చారో చెప్పుకుంటూ ప్రచారం చేయాలి తప్పా ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని అకారణంగా దూషిస్తూ.. ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఓ ముఠా ప్రజల్లో విషప్రచారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని చంద్రబాబు అని సజ్జల పేర్కొన్నారు. 

*విశాఖలో పవన్‌ విన్యాసాలు..* 

విశాఖ పర్యటన సందర్బంగా పవన్‌ కల్యాణ్‌ అనేక రకాల విన్యాసాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గాజువాకలో పవన్‌ కారు కూతలు కూస్తున్నారని అన్నారు. ఆవేశంతో ఊగిపోతూ, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడతారో ఎవరికీ అర్థం కావట్లేదన్నారు. అభిమానుల కేకల వేయడంతో పవన్‌ పూనకంతో ఊగిపోతున్నారన్నారు. పవన్‌ రుషికొండకు వెళ్లినా, విశాఖపట్నం, గాజువాకలో మాట్లాడినా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని తప్పా.. ప్రజలకు ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు కోసం పవన్‌ పనిచేస్తున్నాడన్నారు. గాజువాకలో ప్రజలు చీదరించుకున్నా.. ఎందుకు ఆ నియోజకవర్గంలో పవన్‌ డైలాగులు వేస్తున్నాడో ఎవరికీ అర్థంకావట్లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయి.. అక్కడికి వెళ్లి కర్మ సిద్దాంతం అని చెప్పుకుంటున్నాడు. సేవ చేయడానికి వచ్చా అంటున్నాడు. ఎన్జీవో పెట్టుకుని చేసుకోవచ్చు కదా అని సజ్జల ప్రశ్నించారు. అహంకారంతో నోటికి ఏది వచ్చినట్లు అది మాట్లాడితే ఎలా? అని కౌంటర్‌ ఇచ్చారు. 

చంద్రబాబుకు సీబీఐ ఇప్పుడు గుర్తొచ్చిందా?

అబద్దాలను చెప్పడంలో చంద్రబాబు మించినవారు ఎవరూ లేరని సజ్జల అన్నారు. గతంలో సీబీఐని రాష్ట్రంలోకి రావడానికి వీళ్లేదన్న అతను.. ఇప్పుడు కావాలంటున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై పద్దతి ప్రకారం బురదజల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతున్నారు. తమకు చట్టాలు, రాజ్యాంగం వర్తంచవన్నట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. పుంగనూరు, అంగళ్లులో పోలీసులపై టీడీపీ నేతలు చంద్రబాబు ఆధ్వర్యంలో దాడి జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి