తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్
వైసీపీ ద్వారా అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి
ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
33వ వార్డులో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్
అనంతపురం ఆగస్ట్ 16,అనంత జనశక్తి న్యూస్
వైసీపీ పాలనలో అస్తవ్యస్థంగా తయారైన రాష్ట్రానికి భవిష్యత్ ఉండాలంటే.. అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని 33వ వార్డులో బుధవారం ఆయన భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలసి ఇంటింటికీ వెళ్లి టీడీపీ మినీ మ్యానిఫెస్టో కరపత్రాలను అందజేశారు. అలాగే మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. కాలనీల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని.. ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. పరిపాలన చేతకాక అస్తవ్యస్థంగా మార్చేశారన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ధర్మరంలో ప్రతి రోజు ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ చేస్తున్నామని చెబుతుంటారని.. కానీ సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉంటాయన్నారు. పట్టణంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడంలో విఫలమయ్యారన్నారు. మరోవైపు మినీ మ్యానిఫెస్టోలో అన్ని వర్గాలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయని.. ఇప్పటికే వీటికి ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారన్నది ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు…