జోర్డాన్ సరిహద్దుల్లో గల స్వీడా రాష్ట్రంలోని షుయబ్లో ఓ ఇంటిపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో సిరియా డ్రగ్ డీలర్ మెహ్రీ రామ్థాన్ హతమయ్యాడు. ఈ విషయాన్ని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ ధ్రువీకరించింది. అయితే దీని వెనుక జోర్డాన్ హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. రామ్థాన్ జోర్డాన్ సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నందుకు హతం చేసినట్లు తెలుస్తోంది.
