Search
Close this search box.
Search
Close this search box.

అనుమతులు లేకుండానే ఇసుక రిచ్ తవ్వకాలు…

అనుమతులు లేకుండానే ఇసుక రిచ్ తవ్వకాలు…

– అన్నీ తెలిసిన రెవెన్యూ అధికారుల మౌనం…

– వాహనాల తనిఖీలో బయటపడ్డ బాగోతం

–వెంటనే రవాణాను నిలిపేసిన పోలీసులు

– చెక్ డ్యామును పగలగొట్టి రోడ్డు నిర్మాణాలు

– అక్రమాలపై చర్యలేవి

– అక్రమ రవాణాకు అండగా నిలిచింది ఎవరు..?

– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం

యల్లనూరు, జూన్ 25, అనంత జనశక్తి న్యూస్;

అధికారం అండగా ఉందన్న ధైర్యమో… లేక మమ్మల్ని అడిగే వారు ఎవరు అన్న నిర్లక్ష్యము తెలియదు గానీ అనుమతులు లేకుండానే అన్నదికారికంగా చిత్రావతి నదిలో రీచ్ ను ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారు వైసీపీ నేతల. ఈ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులకు అన్ని తెలిసే మౌనం వహించారన్న విమర్శలు లేకపోలేదు. ఓ దశలో చెప్పాలంటే రెవెన్యూ శాఖ మౌనంతోనే ఇసుక అక్రమ రవాణా సాగిందన్న చర్చ లేకపోలేదు. ఎటువంటి అనుమతులు లేవన్న సమాచారంతో పోలీసులు గత పది రోజుల క్రితం ఇసుక రీచ్ ను మూసేయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెలితే మండలంలోని మేడుకుర్తి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి నదిలో అనదికారికంగా వైసిపి నేతలు ఇసుక రీచ్ ను ఏర్పాటు చేసి గత 20 రోజులుగా భారీ వాహనాల్లో ఇటువంటి అనుమతులు లేకుండానే ఇసుకను తరలించేశారు. ఇన్ని రోజులుగా ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక రవాణా సాగుతోందేమో అన్న భ్రమలోనే మొత్తం మండల అధికార యంత్రాంగం ఉండీ పోయింది. కాదు కాదు వారి నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చు.

అనుమతులను అడగలేర…?

ఇసుక రీచ్ కు అనుమతులు వచ్చాయంటే ఉన్నతాధికారులతోపాటు మైన్స్ అధికారుల నుండి మండల స్థాయి అధికారులైన రెవిన్యూ, పోలీసు శాఖలకు తప్పనిసరిగా ఎన్ని ఎకరాలలో, ఎంత విస్తీర్ణంలో, ఎన్ని రోజులు తవ్వకాలు జరపాలి వంటి అనుమతి పత్రాలను అందజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏమీ లేకుండానే అక్రమ తవ్వకాలు జరుగుతున్న మండల అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం గాని అనుమతి పత్రాలను అడగలేకపోవడం దీనికి సంకేతం. ఇంత మోతాదులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న అధికార యంత్రాంగం తమకేల అన్నట్లు మౌనంగా ఉండిపోయింది. ఐతే అధికార పార్టీ నేతలు కావడం దీనికి ప్రధాన కారణం అన్నట్లు మండలంలో చర్చించుకోవడం విశేషం.

చెక్ డ్యాంను ధ్వంసం చేసి ….

ఇసుక రవాణాకు అడ్డుగా ఉన్న చెక్ డ్యామును ధ్వంసం చేసి ఇసుక రవాణా దారులు రోడ్డును నిర్మించారు. రూ. 3లక్షల వ్యయం చేసి ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెక్ డ్యామును ధ్వంసం చేయడం వారి అక్రమ రవాణాకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రభుత్వ నిర్మాణాలనే ధ్వంసం చేసి రోడ్డులు నిర్మిస్తుంటే గ్రామ స్థాయిలో పనిచేసే అధికార వ్యవస్థ కు కనిపించలేదా…! ఇసుక రవాణా బాధ్యత మైన్స్ శాఖ అధికారులది, ప్రభుత్వ నిధులతో నిర్మించిన నిర్మాణాన్ని ధ్వంసం చేస్తున్న వారు కల్లప్పగించి చూడడం వారిలోని నిబద్ధతకు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం….

ఇసుక అక్రమ రవాణా ప్రభుత్వ అనుమతులతోనే జరుగుతొందన్న భ్రమలో పోలీసులు సైతం ఉండిపోయారు. వాహనాల తనిఖీలలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పరిశీలించగా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన ఎస్సై తన సిబ్బందితో ఇసుక రీచ్ వద్దకు వెళ్లి అనుమతి పత్రాలు చూపించాలంటూ నిర్వాహకులను నిలదీశారు. దింతో ఇసుక అక్రమ రవాణా దారులు ఎటువంటి పత్రాలను చూపించకపోవడంతో అనుమతులు ఉంటేనే తవ్వకాలు జరపాలని లేకుంటే తవ్వకాలు నిలిపి వేయాలంటూ హెచ్చరించారు. వెంటనే ఇసుక అక్రమ రవాణా దారులు మొత్తం వాహనాలను చిత్రావతి నది నుండి తరలించేశారు.

అక్రమ రవాణాపై చర్యలేవి….

చిత్రావతి నది నుండి ఇసుకను భారీ వాహనాలలో అక్రమంగా తరలిస్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఇసుక రీచ్ వద్దకు వెళ్లి రీచ్ ను మూసేయించారు. మరి ఈ అక్రమ రవాణా వ్యవహారం పై ఉన్నతాధికారులకు గాని మండల రెవెన్యూ అధికారులకు గాని మైన్స్ అధికారులతో తెలిసి ఉండదా…?. కంచే చేను మేస్తే కాపాడే వాడెవరు అన్న చందంగా మొత్తం అధికార యంత్రాంగం అధికార పార్టీకి దాసోహమై అక్రమ రవాణాకి అండగా నిలిచిందని మండలంలో చర్చనీయాంకంగా మారింది. సామాన్యుడు తన ఇంటి కోసం ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోవాలన్న తలకింద తపస్సులు చేయాల్సి వస్తుందని, అదే అంగ బలం రాజకీయ అండదండలు ఉంటే ఎన్ని అక్రమాలకైనా పాల్పడేలా అధికారులే వారికి భరోసా కల్పిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. మరి ఇక్కడ జరిగిన ఈ అక్రమ ఇసుక రీచ్ వ్యవహారం పై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలకు చేపడతారో వేచి చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి