తమిళనాడులో తాజాగా బీజేపీ వర్సెస్ డీఎంకే అన్నట్లుగా యుద్దవాతావరణం నెలకొంది. ఇదిలావుంటే తమిళనాడు బీజేపీ చీఫ్, మాజీ యువ ఐపీఎస్ అధికారి అన్నామలైపై అధికార డీఎంకే పరువునష్టం దావా దాఖలు చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ పరువును దిగజార్చేలా అన్నామలై వ్యాఖ్యలు చేశారని చెన్నై కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇటీవల అన్నామలై ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… చెన్నై మెట్రో కాంట్రాక్ట్ ను సెట్ చేయడానికి 2011లో స్టాలిన్ కు రూ. 200 కోట్లు చెల్లించారని అన్నామలై ఇటీవల ఆరోపించారు. అవినీతితో డీఎంకే పార్టీ నేతలు రూ. 1.34 లక్షల కోట్లు వెనకేసుకున్నారని అన్నారు. స్టాలిన్ కుటుంబ సభ్యులు ఒక దుబాయ్ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నామలైపై డీఎంకే పరువునష్టం దావా వేసింది.
