సీఎం క్యాంప్ ఆఫీస్లో రాఖీ పౌర్ణమి వేడుకలు
రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం క్యాంప్ ఆఫీస్ హౌస్ కీపింగ్ మహిళలు సీఎం జగన్ ను కలిసి రాఖీ కట్టారు. వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించి రాఖీలు కట్టించుకున్నారు. ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్… బ్రహ్మకుమారీస్ సోదరీమణులు కూడా రాఖీ కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెప్టెంబరులో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు ఆహ్వానించారు.