Search
Close this search box.
Search
Close this search box.

యువగళం పేరు చెబితే వైసీపీలో వణుకు పుడుతోంది

యువగళం పేరు చెబితే వైసీపీలో వణుకు పుడుతోంది

లోకేష్ 200రోజుల పాదయాత్ర చరిత్ర సృష్టించింది

సంఘీభావ పాదయాత్రలో మాజీ మంత్రి పరిటాల సునీత

ఎమ్మెల్యే సోదరులు గాయత్రి డైరీ యాజమాన్యాన్ని 6కోట్లు డిమాండ్ చేశారు

ఇప్పుడు రైతుల పక్షాన అంటూ నాటకాలాడుతున్నారు

ఎమ్మెల్యే సోదరులకు ఎవరూ భయపడవద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే

అనంతపురం ఆగస్ట్ 31,అనంత జనశక్తి ప్రతినిధి

యువగళం పేరు చెబితేనే వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2వందల రోజులు పూర్తైన సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పోతలయ్య స్వామి దేవస్థానం, పెద్దమ్మ దేవస్థానం, రామాలయం, బీరప్ప స్వామి దేవస్థానం, నాగబావి ముత్యాలమ్మ దేవస్థానం, కొల్లాపురమ్మ దేవస్థానాలలో పూజలు నిర్వహిస్తూ, శివాలయం వరకు రెండు కిలోమీటర్ల మేర సాగింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని సునీత కోరడం జరిగింది. ఈ పాదయాత్రలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారా లోకేష్ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. సంఘీభావ పాదయాత్ర సందర్భంగా చెన్నేకొత్తపల్లి బస్టాండ్ సెంటర్ లో సునీత మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర చేపట్టిన రోజు నుంచి వైసీపీ నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. కానీ లోకేష్ ఎక్కడా తగ్గకుండా దిగ్విజయంగా కొనసాగించారన్నారు. కాళ్లకు బొబ్బలు వస్తున్నా.. ఎండనక వాననక పాదయాత్రలో ముందుకెళ్తున్నారన్నారు. ఇప్పటికే 15జిల్లాల్లో 77 నియోజకవర్గాల్లో 2709కిలోమీటర్ల మేర యాత్ర సాగిందన్నారు. ఎక్కడిక్కడ సమస్యలు తెలుసుకుంటూ, ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడుతూ ముందుకు సాగుతున్నారన్నారు. ఇటీవల టీడీపీ ప్రవేశ పెట్టిన మినీ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తోందన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతుల కోసం పథకాలు తీసుకొచ్చారన్నారు. సీఎం జగన్ మొదటి చెప్పిన విధంగా కాకుండా అన్ని పథకాల్లో కోతలు విధిస్తూ.. ప్రజలను మోసం చేశారని సునీత విమర్శించారు…

*గాయత్రి డైరీ యాజమాన్యాన్ని 6కోట్లు డిమాండ్ చేసింది నిజం కాదా .. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులకు సునీత ప్రశ్న*

రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుల దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని ఈ సందర్భంగా సునీత ధ్వజమెత్తారు. గాయత్రి డైరీ వారితో ఎమ్మెల్యే సోదరులు ఆరు కోట్లు డిమాండ్ చేశారని విమర్శలు చేశారు. రాప్తాడు సమీపంలో ఏపీఐఐసీ ద్వారా ఇదే ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో గాయత్రి డైరీ కోసం 10ఎకరాలు రైతుల నుంచి సేకరించారన్నారు. అయితే ఇప్పటి వరకు దానికి పరిహారం ఇవ్వలేదన్నారు. రైతులు ఒరిజనల్ డాక్యూమెంట్లు ఇవ్వలేదని.. ఎవేవో కారణాలు చెబుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇటు గాయత్రి డైరీ వారి నుంచి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 6కోట్లు డిమాండ్ చేశారని.. వారు 2కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడు భూమి చదును చేస్తుంటే ఎమ్మెల్యే సోదరులు రాజారెడ్డి, చందులకు కూడా చెరో రెండు కోట్లు ఇవ్వాలంటూ వారిని అడ్డుకున్నారన్నారు. 4కోట్లు ఇస్తే కానీ పనులు చేయనివ్వమని బెదిరించారన్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి చెప్పినా ప్రయోజనం లేదన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే అభివృద్ధికి అడ్డుకొని తన స్వార్ధ స్వలాభం కోసం తన సామాజిక వర్గాన్ని కూడా లెక్కచేయకుండా ధనార్జనే ధ్యేయంగా దందాలు చేస్తున్నారన్నారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఒక వైసీపీ నాయకుడు ప్రజలు నడిచే మెయిన్ రోడ్డును కూడా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుంటున్నారంటే వీరి దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఇక ఎన్నో రోజులు సాగవని.. వచ్చేది తెలుగుదేశం పార్టీనేనని ఎవరూ భయపడవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి