మహిళల ఆర్థిక స్వలంబన కోసం మార్కెటింగ్ సౌకర్యం
—– దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే
పుట్టపర్తి,ఆగష్టు 27,అనంత జనశక్తి న్యూస్:
స్వయం సహాయక సంఘాల మహిళలు తాము ఉత్పత్తి చేసిన వాటికి స్థానికంగానే మార్కెట్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నదని శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గణేష్ సర్కిల్ నందు ఏర్పాటుచేసిన ఆహా క్యాంటీన్ తోపాటు స్వయం సహాయక సంఘాలు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 30 స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న పాలనలో సుస్థిర జీవనోపాదుల కల్పనలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంఘాల మహిళలు ఉత్పత్తులు చేసిన తిను బండారాలతో ఇతర వస్తువులను స్థానికంగానే మార్కెటింగ్ లో విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. మహిళలు ఆర్థిక స్వలంబన సాధించాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఈ మార్కెట్ సౌకర్యం మహిళలకు ఎంతో ఉపయోగమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, పుడా చైర్పర్సన్ లక్ష్మీనరమ్మ, వైస్ చైర్మన్లు శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, తిప్పన్న, నెడ్ క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వైసిపి కన్వీనర్ రంగారెడ్డి, మెప్మా అధ్యక్షురాలు సాయి లీల, కౌన్సిలర్లు, మెప్మా సీఎంఎం, సి ఓ లు పాల్గొన్నారు.