Search
Close this search box.
Search
Close this search box.

సామాజిక న్యాయ మహా యాజ్జాన్ని విజయవంతం చేద్దాం: మంత్రి మేరుగ నాగార్జున

సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ పోస్టర్ విడుద‌ల‌ చేసిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయసాయిరెడ్డి

19 వ తేదీన జరగనున్న సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణకు అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి

సామాజిక న్యాయ మహా యాజ్జాన్ని విజయవంతం చేద్దాం: మంత్రి మేరుగ నాగార్జున

ప్రపంచ చరిత్రలో నిలచేలా సీఎం జగన్ 210 (85 అడుగుల బేస్మెంట్, 125 అడుగుల కంచు వా గ్రహం) అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు: మంత్రి ఆదిమూలపు సురేష్ తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం “సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సామాజిక సమతా సంకల్పం సభ, భారత రాజ్యాంగ నిర్మాత డా|| బాబా సాహేబ్ అంబేద్కర్ “సామాజిక న్యాయ మహా శిల్పం” ఆవిష్కరణ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు ఉదయం 11:30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి , మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన భావజాలాన్ని భూజన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్‌ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్‌ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారని, చెప్పినట్లుగానే రూ. 404 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు.నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అని చెప్పే జగనన్నకు వ్యతిరేకంగా దుష్టశక్తులు ఏకమవుతున్నాయని, వాటిని ధరి చేరనివద్దని సూచించారు.. అంబేద్కర్ భావజాలాన్ని కాపాడుకుందామని, జనవరి 19వ తారీఖున జరిగే మాహా యాజ్జాన్ని విజయవంతం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.

అందరూ ఆహ్వానితులే: ఎంపీ విజయసాయిరెడ్డి

అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపం అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారని అన్నారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారని, బడుగు, బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విజయసాయి పేర్కొన్నారు. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని.. ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ లక్ష్యాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మదిలోంచి వచ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేడ్కర్‌ స్మృతివనం రూపుదిద్దుకుందని, బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్‌ పైన 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడిందని చెప్పారు. అయితే విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుందని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్‌ విగ్రహమని తెలిపారు. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో మూడవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

జగనన్నకి మేం రుణపడి ఉంటాం: ఎంపీ నందిగం సురేష్

అంబేద్కర్ ని కొందరు నేతలు ఓట్ల కాక సం వాడుకుంటే.. జగన్ మాత్రం ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద విగ్రహమని తెలిపారు. సీఎం జగన్ కి మా జాతులన్నీ రుణపడి ఉంటాయని చెప్పారు 

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరపురాని ఘట్టం: ఎస్సీ విభాగం అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్

సీఎం జగన్ అందరికంటే గొప్ప అంబేద్కర్ వాదిని ఎస్సీ విభాగం అధ్యక్షుడు, జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరపురాని ఘట్టమని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరం కలిసి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించారు:మంత్రి ఆదిమూలపు సురేష్

స్వరాజ్ మైదానాన్ని గత పాలకులు ఇష్టారాజ్యంగా వాడుకున్నారని మంత్రి ఆదిమూపు సురేష్ మండిపడ్డారు. ప్రైవేటు వారికి ఇచ్చి మాల్ కట్టాలని చూశారని గుర్తు చేశారు.కానీ, సీఎం జగన్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ స్థాపించారని, అంబేద్కర్ భావజాలాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.దళితులకు అధిక సీట్లను కేటాయించిన ఘనత సీఎం జగన్ దే అని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ ఆశించిన ఆశయాలను జగన్ మాత్రమే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి