వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
2లక్షల చెక్ ను అందజేసిన కర్నూలు ఎమ్మెల్యే
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూల్ నగరంలోని 5వ వార్డ్ చిత్తర్ గేరి కీ చెందిన షేక్ షా ఇల్లు అగ్నిప్రమాదం గురి కావడంతో జరిగింది. దీంతో సమాచారం అందుకున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ వారిని పరామర్శించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ముఖ్యమంత్రి సహాయం నిధి కింద 2 లక్షల రూపాయల పరిహారాన్ని బాధితులు షైక్ షా కి అందించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు బాధితులకు 2 లక్షల రూపాయల చెక్ ను మంగళవారం అందించారు. దీంతో బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి , కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.