జర్నలిస్టు జిల్లా జట్టు ఎంపిక సెప్టెంబర్ 4న
కొడిమి జర్నలిస్ట్ కాలనీ క్రికెట్ అకాడమీలో
అనంతపురం పట్టణంలో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని అనంతపురం, సత్యసాయి జిల్లా జర్నలిస్టు జట్టు ఎంపిక కార్యక్రమం సెప్టెంబర్ 4వ తారీఖు ఉదయం 10 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని కోడిమి జర్నలిస్ట్ కాలనీ నందు గల క్రికెట్ అకాడమీలో జరుగుతుంది
క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉన్న 14 నియోజకవర్గాల్లోని వర్కింగ్ జర్నలిస్టు మిత్రులందరికీ ఎంపికలో పాల్గొనవచ్చును
మన నాయకుడు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా జట్లు ఎంపిక కార్యక్రమంలో పాల్గొంటారు
జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు, కెమెరామెన్లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అందరూ ఎంపికలో పాల్గొనవచ్చును
ఎంపికైన జర్నలిస్టు క్రికెట్ జట్లు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొంటుంది
జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే వర్కింగ్ జర్నలిస్టులు ఆధార్ కార్డు జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి సంస్థ గుర్తింపు ఐడి కార్డు ఇతర వివరాలతో తప్పకుండా తీసుకొని రావాలి
కె.విజయ రాజు
జిల్లా కార్యదర్శి
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ