జగన్నాసుర సైకో పరిపాలనను మంటల్లో కలిపేయండి;ఉమామహేశ్వర నాయుడు
కళ్యాణదుర్గం అక్టోబర్ 23,అనంత జనశక్తి న్యూస్
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా జగన్నాసుర సైకో పరిపాలనను మంటల్లో కలిపేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ దగ్గర విజయదశమి సందర్భంగా టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి జగన్నాసుర ఫోటోను మంటల్లో వేస్తూ సైకో పోవాలి అనే నినాదాలు చేస్తు సైకో పోవాలి అనే కరపత్రాలను కూడా కాల్చివేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును అక్రమంగా కేసులు పెట్టి నిజాయితీపరుడిని నిర్బంధించారన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…