బీసీలకు న్యాయం చేసింది.. చేసేది.. తెలుగుదేశం పార్టీనే
పార్టీ అధికారంలోకి రాగానే యాదవులకు సముచిత స్థానం
యాదవులకు మాజీ మంత్రి పరిటాల సునీత హామీ
రాప్తాడు యాదవ సాధికార సమితి కమిటీని ప్రకటించిన పరిటాల సునీత
అనంతపురం జూలై 15,అనంత జనశక్తి న్యూస్
బీసీలకు గతంలో న్యాయం చేసింది.. భవిష్యత్ లో మరింత న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ యాదవ సాధికార సమితి కమిటీని ఆమె ప్రకటించారు. నియోజకవర్గం అధ్యక్షుడిగా సిండికేట్ నగర్ కి చెందిన బిల్లా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా గంతిమర్రికి చెందిన వై.బాలరాజు, ఉపాధ్యక్షులుగా గొల్లవాండ్లపల్లి గంగప్ప, బద్దలాపురం వెంకటరాముడు, గుంతపల్లి రమేష్, వేపచెర్ల రామమోహన్, కార్యనిర్వహక కార్యదర్శులుగా భానుకోట సర్దానప్ప, రామగిరి పూజారి నరసయ్య, తలుపూరు పాల్యం విష్ణు, తగరకుంట బాల నరసింహులు, అధికార ప్రతినిధులుగా బుక్కచెర్ల పవన్ కుమార్, తిమ్మాపురం హరీష్, భోగినేపల్లి లక్ష్మీనారాయణ, ఆత్మకూరు గంగప్ప, కార్యదర్శులుగా కురుగుంట రంగా యాదవ్, గరిమేకలపల్లి గెద్ది నారాయణ, సనప లక్ష్మన్న, భానుకోట బాల రాజకుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా చిన్నంపల్లి నరేష్ యాదవ్ లను నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పరిటాల సునీత శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఇచ్చినవి పదవులుగా భావించవద్దని..పార్టీ మీపై పెట్టిన బాధ్యతగా భావించాలని సూచించారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు అనేక పదవులు ఇవ్వడంతో కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. యాదవులకు భవిష్యత్ లో పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇటీవల పార్టీ అధినేత విడుదల చేసిన మ్యానిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మ్యానిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లాలని సునీత సూచించారు…