ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులోనే అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. బుధవారం ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని తొలుత రిజర్వ్‌లో పెట్టింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.విచారణ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనకు ఇంజక్షన్లు ఇచ్చారని చెప్పారు. ‘నేను 24 గంటల్లో వాష్‌రూమ్‌కి కూడా వెళ్లలేదు. దయచేసి నా డాక్టర్ ఫైసల్‌ని పిలవడానికి అనుమతించండి. మక్సూద్ చప్రాసీకి జరిగినది నాకు జరగకూడదని అనుకుంటున్నాను. గతంలో వారు ఇంజెక్ట్ చేశారు. అతను నెమ్మదిగా మరణించాడు. కస్టడీలో నాకు అలాంటి ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇది నా మరణానికి దారి తీస్తుంది’ అని ఇమ్రాన్ కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నట్టు మెడికల్ బోర్డు ప్రకటించింది. అతని షుగర్ లెవెల్, పల్స్, బీపీ అన్నీ నార్మల్‌గా ఉన్నాయని తెలిపింది. లిపిడ్ ప్రొఫైల్ కోసం రక్త నమూనాలు సేకరించామని చెప్పింది. మరోవైపు పాకిస్థాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. 1000 మందికి పైగా పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్సులలో అన్ని పరిపాలనా, శాంతి భద్రతల విధులు ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్లాయి.
