కేసు నమోదు చేయకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘనే
గుంటూరు సెప్టెంబర్ 13,అనంత జనశక్తి న్యూస్
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ పై కేసు దాఖలు చేయడానికి గుంటూరు పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు?
ద్వేషపూరిత వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయడం పోలీసు ఉన్నతాధికారుల బాధ్యత. 28-04-2023న గౌరవ జస్టిస్ జోసెఫ్, గౌరవ జస్టిస్ నాగరత్న ఇచ్చిన ఆదేశాల మేరకు సుమోటోగా కేసు పెట్టాలి. 24 గంటల్లో గుంటూరు మేయర్ పై కేసు దాఖలు చేయకపోతే సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసును గుంటూరు పోలీసు ఉన్నతాధికారులు ఎదురుకోవాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తాం
–