పేదల ప్రజల హృదయాల్లో డాక్టర్ వైఎస్ఆర్ ది చెరగని ముద్ర – ఎమ్మెల్యే ఆర్కే..
మంగళగిరి నియోజకవర్గంలో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం వద్ద డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు.అనంతరం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణ నందు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఅనంతరం మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద గల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి మరియు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ మురుగు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే గార్లు పేదలకు భోజనాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలను మార్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారని అన్నారు..విద్యా, వైద్య వ్యవస్థల్లో సంపూర్ణ మార్పులు ప్రారంభించిన మహనీయుడని…
రైతులు విద్యార్థులు మహిళలు వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు…
వైయస్సార్ గారు లేని లోటు రాష్ట్ర దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపించిందని…
ఆ మహనీయుడు లేని లోటు ఎవరు పుడ్చలేరని పేర్కొన్నారు..
వైయస్సార్ బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.