“స్పందన” పిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకండి
—– జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో,ఆగష్టు 28,అనంత జనశక్తి న్యూస్:
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం, పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయం నందు, జిల్లా ఎస్పీ ఎస్ వి.మాధవ్ రెడ్డి ఐపీఎస్ సోమవారం నిర్వహించిన “స్పందన” కార్యక్రమంలో ఆర్జిదారుల నుండి 41 పిటీషన్లు స్వీకరించారు,జిల్లా నలుమూలల నుండి జిల్లా పోలీసు కార్యాలయంనకు విచ్చేసిన ప్రజల సమస్యలను ఎస్పీ క్షుణ్ణంగా విని ప్రతీ పిటీషనర్ తో స్వయంగా మాట్లడి, వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకొని, వారి ముందే సంబంధిత స్టేషన్ అధికారి కి ఫోన్ చేసి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందన పిర్యదులను మొదటి ప్రాధాన్యత గా తీసుకొని సమస్యను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్దులు, వికలాంగులు నడవలేని స్థితి లో ఉన్న వారి దగ్గరికి స్వయంగా ఎస్పీ గారే వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.”స్పందన” కార్యక్రమం లో ఎక్కువగా రస్తావివాదాలు, కుటుంబ కలహాలు, అదనపు కట్నం కోసం భర్త/అత్తారింటి వేదింపులు, ఉద్యోగ మోసాలు, భూవివాదాలు, ఆర్ధిక మొసాలు, సైబర్ నేరాలు, సంబంధిత సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. పోలీసు పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని స్పందన పిర్యదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని ఎస్పీ సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులకు ఫోన్ లో ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పితో పాట, అదనపు ఎస్పీ విష్ణు, లీగల్ అడ్వైసర్ సాయి నాథ్ రెడ్డి, సీఐ సతీశ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.