“నాలుగేళ్లలో రూ. 2.16 లక్షల కోట్లిచ్చా.. 14 ఏళ్లలో ఏం చేశావ్”
ఇళ్ల రూపంలో ప్రతి పేదకు రూ. 7 నుంచి రూ. 15 లక్షల ఆస్థిచం
ద్రబాబుకు పేదలకు చేసిన మంచి ఇదీ అని చెప్పి ఓట్లడిగే దమ్ముందా..
175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపని టీడీపీ మనకు ప్రత్యర్థట
గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో సీఎం జగన్
అమరావతి జూన్ 16,అనంత జనశక్తి న్యూస్
“పేదలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు ఇంకో ఛాన్స్ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా.. ఇంటికో కేజీ బంగారం ఇస్తా.. ఓ బెంజ్ కారు ఇస్తా.. అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు బయలుదేరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి పేదలకు ఇది నేను చేసిన మంచి అని చెప్పుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి చివరికి కుప్పంలో పక్కా ఇళ్లు కట్టని చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని నాకు ఉత్తరం రాసి కోరుకుతున్నారు. సంక్షేమ పథకాలన్నీ కాక ఒక్క పేదలందరికీ ఇళ్లు పథకంలోనే రాష్ర్టంలో ఇళ్లు లేని ప్రతి పేద అక్కచెల్లెమ్మల చేతిలో ఇళ్ల రూపంలో రూ. 7 నుంచి రూ. 15 లక్షల ఆస్థిని ఇచ్చాను. చంద్రబాబుకు దమ్ముంటే అదే పేదలకు నువ్వేం చేశావో చెప్పి ఓట్లడుగు”.. సీఎం జగన్
కేవలం నాలుగేళ్ల పాలనలో నవరత్నాల పథకాల కింద రూ. 2.16 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చా.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావో చెప్పాలని, ఏ ఒక్క పేదకైనా పక్కా ఇళ్లు ఇవ్వడం కోసం ఒక్క ఎకరమైనా కొన్నావా అని సీఎం జగన్ మండిపడ్డారు. కుట్ర రాజకీయాలు, అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం తప్ప చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిందేం లేదని, చివరికి తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో కూడా పేదలకు మంచి చేయలేదని విమర్శలు గుప్పించారు. ఎత్తులు, పొత్తులు, కుట్రలతో రాజకీయాలు చేస్తూ.. కనీసం 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా నిలబెట్టని టీడీపీ మనకు ప్రత్యర్థట అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో ఒకే లేఅవుట్ లో నిర్మించిన 8, 912 టిడ్కో ఇళ్లను సీఎం జగన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం పంపిణీ చేసిన మొత్తం టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భాగంగా గృహ నిర్మాణం, మౌలిక వసతులు, స్థల సేకరణ కోసం ప్రభుత్వం రూ. 799.19 కోట్లు ఖర్చు చేసినట్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లు, పేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం రూ. 1,782కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లను కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో లబ్ధిదారుల పేరున రిజిష్ర్టేషన్ చేసి ఇచ్చామని చెప్పడానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబు హయాంలో పేదలకు కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వక పోగా మీ బిడ్డ ప్రభుత్వం పేదల కోసం కేవలం ఇళ్లు కాదు 17 వేల ఊళ్లు కడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు మన మొత్తం జీవితంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ఉచితంగా ఇచ్చింది లేకపోగా. పేదలకు లబ్ధి అసలే లేదని. కాగా సొంతంగా ఇళ్లు కట్టుకునే పేదలను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దోచుకుందని సీఎం జగన్ విమర్శించారు. టిడ్కో ఇళ్ల రూపంలో చంద్రబాబు గత ప్రభుత్వం పేదల ఇళ్లపై అప్పల భారం మోపి బ్యాంకుల చుట్టూ తిరిగే స్థితికి తీసుకువచ్చారన్నారు. టిడ్కో లబ్ధిదారులపై రూ. 3 వేలు చొప్పున 20 ఏళ్ల పాటు కట్టాలని వాళ్ల జీవితాలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిన చంద్రబాబును ఏమనాలో అర్థం కావడం లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో కేవలం ఒక్క రూపాయికే సకల సౌకర్యాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లను అక్క చెల్లెమ్మల పేరుతో పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నట్లు వివరించారు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని పేదలకు కనీసం తన పక్కన ఉండరాదు కూర్చొనే అర్హత లేదనే చంద్రబాబుది పెత్తం దారీ మనస్థత్వమని విమర్శించారు. చంద్రబాబు కుట్ర రాజాకీయాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి నా పేదల అక్క చెల్లెలమ్మలకు నవరత్నాలు పేరుతో నిత్యం అండగా నిలిచామని సీఎం జగన్ పేర్కొన్నారు.
175 ఎమ్మెల్యే అభ్యర్థులు లేని టీడీపీ మన ప్రత్యర్థట..
“మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే అవినీతి, వివక్ష, లంచాలకు ఆస్కారం లేకుండా సచివాలయాలను తెచ్చాం. కొత్త జిల్లాలు.. పోర్టుల నిర్మాణం, మన బడి నాడు నేడు, వైద్య రంగంలో ఉద్యోగుల నియామకం, నాణ్యమైన వైద్య సేవలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, రైతులకు ఆర్బీకేలు, రైతు భరోసా ద్వారా సాయం, పేదలందరికీ పక్కా ఇళ్లు, ఇవన్నీ ప్రతి ఊళ్లోనూ చేసి చూపించాం. మేనిఫోస్టోలో చెప్పిన ప్రతిమాటను పక్కాగా అమలు చేశాం. ఒక్క సారి సీఎంగా ఉంటేనే ఇన్ని చేశామంటే మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు చెయ్యలేదు. ఇవన్నీ ఎందుకు చేయగలిగామంటే పేదల కష్టం మనకు తెలసు, పేదల గుండెచప్పుడు తెలుసు, పేదల అండతో, పేదల్లోంచి, కష్టం నుంచి పుట్టిన పార్టీ మనది. చంద్రబాబు నిత్యం పోత్తుల్ని, ఎత్తుల్ని, కుట్రల్ని నమ్ముకున్నారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులను నిలపలేని టీడీపీ మన ప్రత్యర్థా.. చంద్రబాబు కోసమే పుట్టిన ప్యాకేజీ స్టార్, గత ప్రభుత్వం అంకాగిన ఎల్లో మీడియా మరో సారి రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్రలు చేస్తోంది. కలిసి కట్టుగా రాష్ట్రాన్ని దోచుకోవాలని తోడళ్ల గుంపు ఎదురు చూస్తోంది. ఈ తోడేళ్ల గుంపు ఉన్నా మీ బిడ్డ ఒంటరిగా పోటీకి దిగుతారు. మీ బిడ్డకు పేదలే అండ, ప్రజలకు చేసిన మంచే భరోసా.. దేవుడి దయ, పేదల అండను నమ్మి ఒంటరిగా ఎన్నిలకు దిగుతా. మీ బిడ్డ చెప్పేది కోరేది ఒక్కటే.. అబద్దాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరుగుంటే మాత్రమే కొలమానంగా తీసుకుని మీ బిడ్డకు సైనికులుగా నిలబడండి” అని సీఎం జగన్ కోరారు.
చంద్రబాబు కుప్పంలో ఇప్పుడు ఇళ్లు కట్టుకుంటాడట..
14 ఏళ్లు సీఎంగా పనిచేసి సొంత నియోజవర్గం కుప్పంలో ఇప్పటి వరకు సొంత ఇళ్లు లేని ఇప్పుడు ఇళ్లు కట్టుకోవాలని తనను పర్మిషన్ అడుగుతున్నారని ఎన్నికలు ఇంకో 10 నెలలు ఉండటంతో చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో తనకు సొంతిళ్లు లేదని గుర్తుకు వచ్చిందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. కుప్పంలో మైక్ పట్టుకుని చంద్రబాబు అన్నీ చేసేస్తాను అంటున్నారని గతంలో ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తే సమాధాం చెప్పకుండా తప్పించుకుంటున్నారని వివర్శించారు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్న చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు మీకు ఇది చేశాను కాబట్టి నాకు ఓటెయ్యండి అని అడగే దమ్ము లేదన్నారు. ఇదిగా ఇన్ని ఇళ్లు కట్టించాను ఓటెయ్యండి, రైతులకు ఇది చేశాను కాబట్టి ఓటెయ్యండి అని అడిగే దమ్ము చంద్రబాబకు ఉందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన పాలనలో ఇదీ పేదలకు చేసిన మంచి అని చెప్పడానికి ఒక్కటైనా ఉందా.. కారణం ఏమంటే మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు కాబట్టే మళ్లీ ఎన్నికల కోసం ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
పేదలకు సీఎం జగన్ పంపిణీ చేసిన 8, 912 టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తి వివరాలివీ..
కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో నిర్మించిన 8, 912 టిడ్కో ఇళ్లను సీఎం జగన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం పంపిణీ చేసిన మొత్తం టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భాగంగా గృహ నిర్మాణం, మౌలిక వసతులు, స్థల సేకరణ కోసం ప్రభుత్వం రూ. 799.19 కోట్లు ఖర్చు చేసినట్లుగా సీఎం జగన్ పర్కొన్నారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లు, పేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం రూ. 1,782కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లను కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో లబ్ధిదారుల పేరున రిజిష్ర్టేషన్ చేసి ఇచ్చామని చెప్పడానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.
గుడివాడలోని మరో ప్రాంతంలో 178.63 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు, నిర్మాణంలో ఉన్న మరో 4,500 ఇళ్ల హక్కు పత్రాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 84 “వైఎస్సార్-జగనన్న”లే అవుట్లలో మంజూరు చేసిన 13,145 ఇళ్ల పట్టాల విలు రూ. 657 కోట్లుగా ఉందని. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద మొత్తం 8,859 ఇళ్లు మంజూరు కాగా వీటి విలువ రూ. 239 కోట్లుగా ఉందని ఈ ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, మౌలిక వసతులతో కలిపి గుడివాడ నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందించిన ఇళ్ల విలువ రూ. 983 కోట్లు ఉన్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీదనే ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్టేషన్లు చేశామన్నారు. దీంతో ప్రతి పేద అక్కచెల్లెమ్మకు అక్కడ ఉన్న ఇంటి స్థలం విలువను బట్టి కనీసం రూ. 5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు లబ్ధి చేకూరినట్లు అవుతుందని సీఎం జగన్ వివరించారు. పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం అంటే రూ. 2 లక్షల కోట్లకు పైగా సంపదను ఉంచినట్లు తెలిపారు.