Search
Close this search box.
Search
Close this search box.

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా…

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా…

—– బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు

—–ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాల నుండీ నొక్కేస్తున్న వైనం

—— గత మూడు నెలల కాలంలో ఈ ముఠా సభ్యులు సుమారు 300 మంది బ్యాంకు ఖాతాల నుండి రూ.39,48,304/- లు కాజేసినట్లు లావాదేవీల గుర్తింపు

—– గత 13 నెలల నుండీ ఎన్ సి ఆర్ పి 1930 నంబర్ లకు జిల్లా నుండీ 1484 ఫిర్యాదులు…

——ప్రజల ఖాతాల నుండీ మొత్తం రూ. 2,16,26,472/- మాయం చేసిన సైబర్ నేరగాళ్లు 

—– ఈ ఫిర్యాదులపై దృష్టి సారించిన జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ సైబర్ విభాగంచే విచారణ

అనంతపురం,ఫిబ్రవరి 03,అనంత జనశక్తి న్యూస్:

ప్రజల బ్యాంకు ఖాతాల నుండీ సైబర్ నేరగాళ్లు నొక్కేసిన మొత్తంలో ఇప్పటి వరకు రూ.1,50,25,967/- డబ్బును తిరిగి బాధితుల ఖాతాల్లోకి జమ చేయించిన సైబర్ పోలీసులు… మిగితా డబ్బు జమ చేయించడం కోసం తగు చర్యలు తీసుకుంటున్న సైబర్ పోలీసులు, సైబర్ నేరాలకు పాల్పడుతూ దేశంలో ఏ మూలన దాక్కున్నా వదలని అనంత పోలీసులు, జమ్ముకాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో దాక్కున్నా సైబర్ నేరగాళ్లను ఇదివరకే పట్టుకున్న పోలీసులు బీహార్ కు వెళ్లి తాజాగా అరెస్టు చేయడం విశేషం,శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో తాజాగా అరెస్టు చేసిన బీహార్ సైబర్ ముఠా అరెస్టు వివరాలు మీడియాకు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడించారు,అనంతపురం పోలీసులు సైబర్ నేరగాళ్లపై పంజా విసిరారు. దేశ సరిహద్దుల్లో… దేశ నలమూలలా ఏ రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నా వదలడం లేదు. ఇదివరకే జమ్ము కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటూ సైబర్ నేరాలకు ఒడిగట్టిన నిందితులను అరెస్టు చేసిన అనంతపురం సైబర్ పోలీసులు తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన ముఠాను అరెస్టు చేశారు. ఇంకొకరు అరెస్టు కావాల్సి ఉంది, (ఏఈపిఎస్) ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా గత మూడు నెలలో గుత్తి పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 50 మందికి పైగా మోసానికి గురైనట్లు ఎన్ సి ఆర్ పి పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుల ఛేదింపుపై దృష్టి సారించిన పోలీసులు గుత్తి పోలిస్ స్టేషన్ లో సి ఎన్ ఆర్ ఓ 308/2023 కేసు నమోదు చేసి బీహార్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు,

** ప్రస్తుతం అరెస్టయిన నిందితుల వివరాలు :

1) నూర్ ఇస్లాం, వయస్సు 34 సం.లు, మహరాజ్పుర, పూర్ణియ జిల్లా, బీహార్ రాష్ట్రం

2) మహమ్మద్ ఇస్రాఫిల్, వయస్సు 29 సం.లు, పూర్ణియ జిల్లా, బీహార్ రాష్ట్రం

3) బబృద్దిన్,పూర్ణియ జిల్లా, బీహార్ రాష్ట్రం పరారీలో ఉన్నాడు

** ఈ ముఠా ఏ ఈ పి ఎస్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడిన తీరు :

 రిజిష్టర్ ఆఫీసుల వెబ్ సైట్ల ద్వారా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుంటారు. వీటిల్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఆధార్ కార్డు నంబర్లను సేకరించారు.విదేశాల నుండీ తెప్పించుకున్న కొన్ని కెమికల్స్ ఉపయోగించి బాధితుల వేలి ముద్రలు పోలిన నకిలీ వేలి ముద్రల నమూనాను తయారు చేసుకుంటారు,

ఏ ఈ పి ఏస్ యంత్రాన్ని సిద్ధం చేసుకుని తద్వారా బాధితుడికి సంబంధించిన నకిలీ వేలి ముద్రలు, ఆధార్ నంబర్ సహాయంతో ఆధార్ నంబర్ తో అనుసంధానించబడిన బాధితుల బ్యాంకు ఖాతాల నుండీ రూ. 10 వేల చొప్పున సుమారు 300 మంది బ్యాంకు ఖాతాల నుండీ రూ.39,48,304/- లు ఈ ముఠా సభ్యులు కాజేశారు, ఈ విధంగా మోసం చేసిన సొమ్మును ప్రస్తుతం అరెస్టయిన ఇద్దరితో పాటు పరారీలో ఉన్న ఇంకో నిందితుడు కలసి సమానంగా పంచుకున్నారు,

జిల్లాలో సైబర్ నేరాల ఛేదింపుపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కనుసన్నలలో సైబర్ సెల్ పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. 

** సైబర్ నేరగాళ్లు దేశంలో ఎక్కడ దాక్కున్నా జిల్లా ఎస్పీ చొరవతో వదలని అనంత పోలీసులు… 

1) నిరుద్యోగ యువత, అమాయక ప్రజల కష్టార్జితాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠా నాయకుడు మరియు దేశ విదేశాలలో …సైబర్ నేరాలలో ఆరితేరిన కింగ్ పిన్ అనయతుల్లా ఖాన్ @ ఫర్హాన్ ను జమ్ము & కాశ్మీర్ లో గత డిశంబర్ నెలలో అరెస్టు చేసిన అనంత పోలీసులు,

2) వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల పేరున ఫేక్ కాల్ / మెసేజీలతో సైబర్ నేరాలకు ఒడిగడుతున్న కీలక నిందితుడైన రాజస్థాన్ రాష్ట్రంకు చెందిన రిజ్వాన్ ను అదే ప్రాంతానికి వెళ్లి అనంతపురం ఒన్ టౌన్ పోలీసులు ఈ ఏడాది జనవరి రెండవ వారంలో అరెస్టు చేశారు. మహిళల ఫోటోలను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుని వాట్సాప్ ఛాటింగ్ ద్వారా పరిచయం కావడం… ఆ తర్వాత న్యూడ్ వీడియోలు పంపి అవతలి వ్యక్తుల వీడియో ఫోటోలను సేకరించి సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ డబ్బు డిమాండ్ చేసి మోసాలకు పాల్పడటంలో రిజ్వాన్ ఆరితేరాడు. ఇదే కేసులో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళను అంతకు మునుపే అరెస్టు చేశారు. 

3) ఇళ్ల తాళాలు పగులగొట్టి పగలు దొంగతనాలలో ఆరి తేరి 5 రాష్ట్రాలలో 80 కి పైగా కేసులు ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరగాడైన మహారాష్ట్రకు చెందిన లికన్ కులకర్ణి @ సచిన్ మానే గత డిశంబర్ లో గుంతకల్ ఒన్ టౌన్ & సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు,4) జార్ఖండ్ రాష్ట్రంలో ఫిస్టోల్ కొనుగోలు చేసి భూ సెటిల్మెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను గత నవంబర్ నెలలో గుత్తి పోలీసులుఅరెస్టు చేశారు,

5) కొరియర్ పేరున మోసాలకు పాల్పడిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ నేరస్తులపై మూడ్రోజుల కిందట చర్యలు చేపట్టిన పోలీసులు,జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ సైబర్ విభాగం సి.ఐ షేక్ జాకీర్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వెళ్లిన అనంత పోలీసు బృందాలకి సహకారం అందించారు. వీరందర్నీ జిల్లా ఎస్పీ అభినందించారు.

** సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి

— జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరించడం… సదరు వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసే పద్ధతి అయిన ఏ ఈ పి ఎస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మీ వ్యక్తిగత సమాచారంతో పాటు మీ వేలి ముద్రలను తరచుగా సమాచారం నిమిత్తం ఎవరికైనా ఇస్తుంటారా ! అయితే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త ! ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు వేలి ముద్రలను ఆధారంగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసంలో మొదటగా సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను అనగా ఆధార్ కార్డు వివరాలు, మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వేలి ముద్రలను వివిధ మార్గాల ద్వారా సేకరిస్తారు. ఆ విధంగా సేకరించిన మీ యొక్క ఖాతా, వేలి ముద్రల వివరాలను ఉపయోగించి మీ యొక్క ఖాతా నుండి డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. ఈ విధమైన డబ్బును డ్రా చేసే పద్దతినే ఏ ఈ పి ఎస్ అని అంటారు. ఈ ఏఈ పి ఎస్ ద్వారా డబ్బులను పొందటం కోసం మీ యొక్క ఖాతాకు లింకు అయినటువంటి ఆధార్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క వేలి ముద్రలు అవసరం. ఈ ఏఈపిఎస్ విత్ డ్రా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ఏ టి ఏం సౌకర్యం అందుబాటులో ఉండదో ఆ ప్రాంతాలలో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కల్పించారు. ఈ రకంగా నగదును 10,000/- లోపు మన సౌకర్యం నిమిత్తం డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రకంగా బ్యాంక్ ఖాతా ను బట్టి ఎన్ని సార్లయినా సైబర్ నేరగాళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించి ఖాతా దారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

 * తీసుకోవాల్సిన జాగ్రత్తలు …

మీరు తరచుగా మీ యొక్క ఖాతా బ్యాలెన్సు ను చెక్ చేసుకోండి. 

మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, వేలి ముద్రలను అనవసరంగా ఇవ్వకండి.మీకు ఆధార్ ద్వారా డబ్బు ఉపసంహరణ అవసరం లేదు అనుకుంటే మీరు వెంటనే మీ బ్యాంక్ కి వెళ్లి మీ యొక్క ఖాతా కి ఉన్నటువంటి ఆధార్ ద్వారా డబ్బు డ్రా చేసుకునే ఆప్షన్ డిసేబుల్ సిస్టమ్,

బ్యాంకులు, సమీపంలోని మీ సేవా లేదా ఇంటర్నెట్ సెంటర్ లలో ఆధార్ ను లాక్ చేసుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.మీ యొక్క బ్యాంకు అకౌంట్ కు మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేక వేరే ఆధార్ నెంబర్ లింక్ లో ఉందా అని ఒకసారి బ్యాంకు లో చెక్ చేసు కోవాలన్నారు,లేదా 1930 కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి