Search
Close this search box.
Search
Close this search box.

జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించేందుకోసం సర్వే చేపట్టాలి

జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించేందుకోసం సర్వే చేపట్టాలి

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

అనంతపురం, ఆగస్టు 31 :అనంత జనశక్తి న్యూస్ 

జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ ను గుర్తించేందుకోసం సర్వే చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థ నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్ లు, జిల్లా పంచాయతీ అధికారి మరియు సంబంధిత అధికారులతో జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మాన్యువల్ స్కావెంజర్స్ చట్టం – 2013 ప్రకారం జిల్లాలో ఎంతమంది మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు అనే దానిపై సీరియస్ గా సర్వే నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ, పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారా, ఉంటే ఏం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనేది గుర్తించాలన్నారు. వారం పది రోజుల గడువులోపు సర్వే రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు ఆయా మున్సిపాలిటీలలో కొత్తగా భవనాల ప్లాన్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు మరుగుదొడ్డికి గుంతలు తవ్విస్తున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. డ్రైనేజీలకు మరుగుదొడ్డి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ఉంటే అలాంటి వారిపై పెనాల్టీలు వసూలు చేయాలన్నారు. సర్వే పూర్తి చేసి గుర్తించిన వారు గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం నుంచి పునరావాసం, ఆర్థిక సహాయం కల్పించేలా చూడాలన్నారు. సఫాయి కర్మచారులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గైడ్లైన్స్ ప్రకారం వారికి మాస్క్, గ్లౌజులు, షూలు, ఆయిల్, సోప్, హెల్మెట్, సేఫ్టీ ప్యాక్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తదితర 44 రకాల భద్రతా పరికరాలు, సదుపాయాలు కల్పించాలన్నారు. మున్సిపాలిటీ స్థాయిలో శానిటేషన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో, గ్రామస్థాయిలో వెల్ఫేర్, పంచాయతీ సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించాలని, వారికి ఈ వ్యవస్థ పై అవగాహన కల్పించాలన్నారు. సఫాయి కర్మచారి కుటుంబ సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారు స్వయం ఉపాధి పొందేలా చూడాలని, అర్హత కలిగిన దరఖాస్తులను పరిశీలన చేయాలన్నారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పి రామిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డీపీఓ ప్రభాకర్ రావు, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి దేవి, ఎల్డిఎం సత్యరాజ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుజాత, విజిలెన్స్ కమిటీ మెంబర్ పెన్నోబులేసు, మున్సిపల్ కమిషనర్ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి