ఘనంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి పుట్టినరోజు వేడుకలు
అన్నదాన కార్యక్రమం రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు
శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మొక్కలు అందించిన హనుమంతరాయ చౌదరి
అనంతపురం. మే 26,అనంత జనశక్తి న్యూస్
అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి 63 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో నాయకులు, కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో ప్రభాకర్ చౌదరి ని సన్మానించారు. ఉదయం 6 నుంచే ఆయన నివాసం కు నాయకులు, కార్యకర్తలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు అభిమానులతో ఆయన నివాస ప్రాంగణం అంతా సందడిగా మారిపోయింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి జామ, ఉసిరి సపోటా, మామిడి, నేరేడు, తో పాటు రకరకాల గులాబీ మొక్కలను పంపిణీ చేశారు. ఆయన ప్రతి వేడుకకు రకరకాల పండ్ల, పూల మొక్కల పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులు భార్య విజయలక్ష్మి, కుమారుడు మధుకర్ చౌదరి, కోడలు హర్షిని ఆధ్వర్యంలో మదర్ తెరిసా, గురు రాఘవేంద్ర ఆశ్రమం, రాయల్ నగర్ అనాధ ఆశ్రమం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రుద్రంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎస్ఎం భాషా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు.
ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు రాష్ట్ర నాయకులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆలం నరస నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న, గంజి నాగరాజు, అర్బన్ టిడిపి క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీలకు అతీతంగా పలువురు వైసిపి నాయకులు కూడా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
మహానాడుకు తరలిన నాయకులు
రాజమహేంద్రవరంలో ఈనెల 27, 28న జరుగుతున్న మహానాడుకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో పాటు అర్బన్ తెలుగుదేశం నాయకులు 300 మంది బయలుదేరి వెళ్లారు. అంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 100 వాహనాలతో పాటు పలువురు ట్రైన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ ఏడాది మహానాడుకు బయలుదేరి వెళ్లారు.