నగరంలోని ఉప రవాణా శాఖ డిప్యూటీ కమిషన్ కార్యాలయంలో డిటిసి ఎన్.శివరామ్ ప్రసాద్ శుక్రవారం తన ఛాంబర్ లో వాహనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిసి మాట్లాడుతూ….. కొత్త వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్, శాశ్వత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే కస్టమర్లకు డెలివరీ చేయాలన్నారు. అలా టిఆర్, పిఆర్ లేకుండా డెలివరీ చేయడం వలన కస్టమర్లు తీవ్ర ఇబ్బందులతో పాటు నష్టం ఎదుర్కోవలసి వస్తుందన్నారు. అందువలన టిఆర్, పి ఆర్ కచ్చితంగా చేసిన తర్వాతే డెలివరీ చేయాలన్నారు. హెల్మెట్ లేకుండా అమ్మకాలు చేస్తున్నారని, దీంతో 37 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నాలుగు చక్రాల వాహనాల ప్రమాదాలు కూడా 4-8 శాతం ఉన్నాయన్నారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ కాలం వచ్చిందని, ఏ డీలరు ఎన్ని వాహనాలు అమ్మకాలు చేశారో అనే వివరాలు కూడా వాహన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు అన్నారు. రవాణా శాఖ నిబంధనలు పాటించకపోతే మీ వ్యాపారాలను నాలుగు నెలల పాటు బంద్ చేస్తామని హెచ్చరించారు. లైఫ్ టాక్స్ వసూళ్ల పూర్తిగా తగ్గిందని, ఎందుకు తగ్గిందని డీలర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన ఫ్లెక్సీ తయారుచేసి ప్రతి షోరూమ్ దగ్గర ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డీలర్లు కూడా ప్రతినెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శాఖ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని డీలర్లను అడగగా…. ఆర్సి కార్డులు రావడంలేదని చెప్పగా…. ఇందుకు డిటిసి స్పందిస్తూ ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సాయంత్రం పొల్యూషన్ వాహనాల యజమానులతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఓ సురేష్ నాయుడు, డీలర్లు, పొల్యూషన్ వాహనాల యజమానులు, తదితరులు పాల్గొన్నారు
