భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన కోవెలలో కొలువైన మూలమూర్తులు దర్శనమివ్వడంతో భక్తులు జైశ్రీరామ్ నామాలను పఠించారు. రామయ్యకు అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి ఆరాధించారు. నిత్యకల్యాణం క్రతువు గురించి ప్రవచిస్తుండగా దీనికి అనుగుణంగా వేడుకను నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనులను పూజించి పుణ్యాహవాచనం కొనసాగించారు. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
