నెల్లూరు జిల్లా, ఉదయగిరి, దుత్తలూరులో చిరకాల రాజకీయ శత్రువులు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగించారు. మేకపాటి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే చర్చలు సాగాయి. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని మేకపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
