మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్‌పై లైంగిక వేధింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. జర్నలిస్ట్‌పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడి, పరువు తీశారంటూ అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది. ఈ కేసులో ఆమెకు 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 41 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. విచారణలోని తొమ్మిది మంది న్యాయమూర్తులు జ్యూరీ.. జీన్ కారోల్ అత్యాచార ఆరోపణలను తోసిపుచ్చింది. కానీ, మూడు గంటల కంటే తక్కువ సమయం జరిగిన చర్చలో నిశితంగా పరిశీలించిన జ్యూరీ.. ట్రంప్‌పై ఆమె చేసిన ఇతర ఫిర్యాదులను సమర్ధించింది. మెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై లైంగిక ఆరోపణల కేసులో తీర్పు వెలువడడం ఇదే మొదటిసారి. దశాబ్దాల నాటి లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు, డజను మంది మహిళలపై చట్టపరమైన కేసులను మాజీ అధ్యక్షుడు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో నష్టపరిహారం కోరుతూ కారోల్ ట్రంప్‌పై దావా వేసింది. కారోల్ చేసిన ఆరోపణలు తనకు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయన్న ట్రంప్ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, కోర్టు తీర్పుపై రిపబ్లికన్ నేత స్పందిస్తూ.. ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కారోల్ లైంగిక వేధింపుల సమర్థవంతంగా నిరూపించినట్టు నిర్దారించిన జ్యూరీ.. ఇందుకు ఆమెకు $2 మిలియన్ డాలర్లు, పరువు నష్టం కింద 3 మిలియన్ డాలర్లు మొత్తం 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన జ్యూరీ ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత మాన్హాటన్ ఫెడరల్ కోర్టు వెలుపల చిరునవ్వుతో కనిపించిన ఆమె.. మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఆమె తరఫున లాయర్ మాత్రం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
