ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం వైయస్ జగన్
ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు
ఇటు పక్క పాండవ సైన్యం..అటు పక్క కౌరవ సైన్యం ఉంది
పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు
ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు
ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే
మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు
అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు
గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు
మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం
పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా
75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను
ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి
ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది
ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది
మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు
మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం
ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు
56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం
పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి
ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ
కష్టపడ్డవారందరికీ కూడా గౌరవం ఇచ్చిన పార్టీ వైయస్ఆర్సీపీనే
మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు
మీ బిడ్డ చెప్పాడంటే… చేస్తాడంతే
ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
భీమిలి జనవరి 27,అనంత జనశక్తి బ్యూరో
మరో 75 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి తాను సిద్ధమని..మీరు సిద్ధమా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని సీఎం పేర్కొన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం.. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడని సీఎం పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు.
భీమిలిలో అటు సముద్రం..ఇటు జన సముద్రం కనిపిస్తుంది ఈ రోజు.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తున్నారు.
ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే..అక్కడే కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్టచతుష్టయం ఉంది. గజ దొంగల ముఠా ఉంది వాళ్లకు..వారి వ్యూహాల్లో, కుట్రలు, కుతంత్రాల్లో, మోసపూరిత వాగ్ధానాలు, వెన్నుపోట్లు, ఎత్తులు, పొత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తుంది.
పద్యవ్యూహంలో చిక్కుకుని బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు..అర్జునుడు. అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఇంత మంది తోడు కృష్ణుడి రూపంలో మీ బిడ్డకు ఇంతటి అందడండలు ఉన్నాయి కాబట్టే మీ బిడ్డ భయపడడు. తొనకడు, మీ బిడ్డకు అందరి అండదండలు ఉన్నంత కాలం భయపడడు.
ఈ 56 నెలల్లో ప్రజలపై ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తున్న ఆ పథకాలే మనకు బాణాలు, అస్త్రాలు.
ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్..వైయస్ఆర్ సీపీ టార్గెట్. ఈ యుద్ధంలో వైయస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అందరూ ఒడిపోవాల్సిందే.
మనకు అంతటి గొప్ప విజయాన్ని అందింజే అంశాలు ఏంటో మీ అందరితో పంచుకోవడానికి భీమిలి పట్టణంలో సమావేశం అయ్యాం.
2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్రయాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగించేందుకు సన్నాహక సమావేశంలో ఇక్కడ జరుగుతోంది.
ఈ సమావేశం మన పార్టీని భుజాన మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానుల్లో ఆత్మవిశ్వాసం నింపే కార్యక్రమం ఇది.
మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణశుద్ధితో బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా భావిస్తూ 99 శాతం హామీలు నెరవేర్చాం.
గతంలో ఎప్పుడైనా గమనిస్తే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తరువాత చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయం చూశాం. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ఆ సంప్రదాయాన్ని మార్చాం. ప్రతి ఇంట్లో మీ బిడ్డను, వైయస్ఆర్సీపీని తమ పార్టీగా భావిస్తున్నారు.
చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడంటే దాని అర్ధమేంటో ఆలోచన చేయండి.
ఈ చంద్రబాబు తాను ఫలాన మంచి పని చేశానని కానీ, పథకాలు తెచ్చానని చెప్పలేక కొత్త పథకాలతో గారడీలు చేస్తున్నారు. దానికి అర్థమేంటో తెలుసా..? ప్రజల్లో వారు లేరు అని అర్థం. చివరకు 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా వారికి రావని అర్థం. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు లేరని అర్థం.
మరోవంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాధ..ఇంటింటి విజయ గాధ, మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసు, భవిష్యత్ ఉన్న పార్టీ.
గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త రికార్డు సృష్టించింది. మన మేనిఫెస్టోలో ఏకంగా 99 శాతం వాగ్ధానాలు నెరవేర్చిన పార్టీ మనది.
ఇవాళ నేను గర్వంగా చెబుతున్నాను..మోసాన్ని, అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ. మనం చేసిన మంచిని, ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకున్నాను.
మనది పేదరికం, అసమానత సంకేళ్లను బద్ధలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతబ్ధంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత ఉన్న ప్రభుత్వం మనది.
ఇంటింటికి వెళ్లి కొన్ని విషయాలు వివరించండి. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం. ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య, మోసానికి, విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతుందని ప్రతి ఇంటిలో చెప్పండి.
2014లో చంద్రబాబు 600వాగ్ధానాలు ఇచ్చారు. మరోవైపు మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాల్లో 99 శాతం అమలు చేసి ప్రతి ఇంట్లో సంతోషంతో సంబరపడుతున్న సందర్భాన్ని ప్రతి ఇంట్లో చెప్పండి.
మరో విషయం మీరందరూ గమనించండి..మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా..ఏ గ్రామమైనా తీసుకోండి..ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు.
మీ జగన్ ఏం చేశారంటే..ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 540 పౌరసేవలు కనిపిస్తాయి. మన పిల్లలు శాశ్వత ఉద్యోగులు మన పిల్లలే కనిపిస్తారు.
ఎక్కడా కూడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటింటికీ ఒకటో తారీఖున ఉదయమే పింఛన్, పౌరసేవలు, ఏ పథకమైనా కూడా మన గడప వద్దకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంట్లో చెప్పండి.
ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతు ఇంట్లో చెప్పండి.
ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటా జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం మీ బిడ్డ పాలనలోనే అని చెప్పండి.
నిరుపేదలు చదువుకునే మన పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియంతో పాటు ట్యాబ్‌లు, ఐఎఫ్‌బీలు, ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చింది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పండి.
ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీసు కనిపిస్తుంది. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ వచ్చింది మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.
ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చిన బ్రాండ్‌బ్యాండ్ సేవలు, డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి.
ఇలాంటి మార్పులు తీసుకురావాలి. వివక్ష, అవినీతి లేకుండా ప్రతి పేదవాడి చెయ్యి పట్టుకుని నడిపించాలనే ఆలోచనలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబుకు ఏనాడు కూడా మనసుకు కూడా రాలేదు. ఈ మాదిరిగా చేయవచ్చు. ఈ మాదిరిగా పాలన చేయవచ్చు అన్న మనసు చంద్రబాబుకు రాలేదు. చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు వచ్చినా ఇంత గొప్పగా చేయవచ్చు అన్న ఆలోచన ఆ పెద్దమనిషికి రాలేదు. ఎందుకో తెలుసా..కారణం వాళ్లు పెత్తందారులు కాబట్టి.
పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందార్ల పొలాల్లో పని చేసే ప్రజలు తమ ఇళ్లలో పని చేసే పనిమనిషిలు కేవలం పొట్టకూటి కోసం ఉండే జనాలు అని చంద్రబాబు నమ్మకం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎవరూ బాగుపడరు. అందరూ బాగుపడాలని, వారి పిల్లలు గొప్పగా చదువుకోవాలనే తపన, తాపత్రయం ఈ పెత్తందార్లకు లేదు.
రైతు సంక్షేమం
రైతు సంక్షేమంలో మనమెక్కడా? చంద్రబాబు ఎక్కడా..రుణమాఫీ చేస్తామని నిలుపునా చంద్రబాబు ముంచాడు. ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అయితే..రైతు భరోసా అంటే జగన్..సకాలంలో ఎరువులు, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ అందుతున్నాయంటే గుర్తుకు వచ్చిది మీ జగన్..ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ అంటే గుర్తుకు వచ్చేది మీ జగనే. అక్వా రైతులకు సబ్సిడీ అందుతుందంటే గుర్తుకు వచ్చేది మీ జగనే. ఏ పొలంలోకి వెళ్లినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది?. చంద్రబాబు మార్కు ఎక్కడుంది. ఎక్కడా చూసినా కనిపించిందే వైయస్ఆర్సీపీ, జగన్ మార్కు కనిపిస్తుంది.వైద్యం..ఆరోగ్యం..
108, 104, ఆరోగ్యశ్రీలో 3 వేల ప్రోసిజర్లు, ఆరోగ్య ఆసరా, విలేజీ క్లినిక్స్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, వైద్యరంగంలో ఏకంగా 53 వేల వైద్య నియామకాలు. నాడు–నేడుతో బాగుపడుతున్న ఆసుపత్రులు ఇలా ఏది చూసినా కనిపించేది ఒక్క వైయస్ఆర్, ఒక జగన్, వైయస్ఆర్సీపీ మార్కు కనిపిస్తుంది.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు మార్కు ఎక్కడ ఉంది..? ఎక్కడ చూసినా కనిపించేది వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ మార్కు కనిపిస్తుంది.
విద్యారంగం..
ఏప్రభుత్వ బడులు తీసుకున్నా..విద్యారంగాన్ని తీసుకున్నా..నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ నుంచి ఐబీ వరకు ప్రయాణం, బైలివింగబుల్ టెక్స్›్ట బుక్స్, బైజూస్ కంటెంట్, ట్యాబులు, పేద పిల్లలు వెళ్లే బడుల్లో ఏకంగా ఐఎఫ్‌పీలు, గోరుముద్ద, విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతున్న పిల్లల తల్లిండ్రులు అప్పులపాలు కాకూడదని జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువులు ఇలా ఏది తీసుకున్నా కూడా చంద్రబాబు మార్కు ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడ చూసినా కనిపించేది వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ మార్కు కనిపిస్తుంది.సామాజిక న్యాయం..
పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ నామినెటెడ్ పదవులు, పనుల్లో సగం ఈ వర్గాలకే ఇచ్చేందుకు చట్టం చేశాం. కేబినెట్లో 60 శాతం మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, అసెంబ్లీ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నా మైనారిటీ అక్క. ఇలా ఎక్కడ చూసినా కూడా నా వర్గాలకు గుండెల్లో పెట్టుకున్నాను. గుడి చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టిలు కనిపిస్తారు. వారిపై గుండెల నిండ ప్రేమ ఉంది కాబట్టే ఈ 56 నెలల పాలనలో అక్షరాల 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో ఏకంగా 80 శాతం నా..నా.. అని పిలుచుకునే నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు ఉన్నారు. ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఏకంగా రూ. 2.53 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లడం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఇందులో ఏకంగా 75 శాతానికి పైగా నా..నా..నా అని పిలుచుకునే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకే వెళ్లింది అని చెప్పడానికి గర్వపడుతున్నాను.ఈ మాదిరిగా ఆప్యాయత చూపిస్తున్నాను కాబట్టే అట్టడుగున ఉన్న పేదలకు అధికారుల నుంచి వలంటీర్ల వరకు సెల్యూట్ కొట్టి పని చేస్తున్నారు. పేద వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కడ ఉంది. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడారు. బీసీల తోకలు కత్తరిస్తానని హెచ్చరించాడు. ఆలోచన చేయండి. ఎక్కడ ఉంది పేద సామాజిక వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ. ఎక్కడ చూసినా కూడా కనిపించే, ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది, ఏ గుండెలో చూసినా కనిపించేది వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ మార్కు కనిపిస్తుంది.
అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయం..
రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈ రోజు దేశంతో మనం పోటీ పడుతున్నాం. ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. వారు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మాను. వారి కోసం ఎప్పడూ జరగని విధంగా వైయస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకం, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం..ఇలా మేలు చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే.
2014లో ఎన్నికల ప్రణాళికలో చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసిన ^è రిత్ర చంద్రబాబుది. 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మోసం చేశాడు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానని మోసం చేశాడు. సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేసిన చరిత్ర చంద్రబాబుది. ఏ పేద కుటుంబానికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. 2014లో చంద్రబాబు తాను చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి ఆ తరువాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించిన వ్యక్తి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం. ఇవన్నీ విన్న తరువాత..ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని కానీ, చంద్రబాబుకు ఓటు వేస్తామని ఎవరైనా అనగలరా? . ఇన్ని నిజాలు తెలిసిన తరువాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా? అని అడుగుతున్నాను.
ఒక్కటి గమనించండి..2019లో మనం అధికారంలోకి వచ్చే వరకు గత ప్రభుత్వం ఖర్చు చేõసిన ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి అవినీతి, లంచాలు, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇచ్చారా? ప్రతి రూపాయి కూడా అవినీతి, లంచాలు లô కుండా ఇవ్వవచ్చు అని చేసి చూపించాం. 56 నెలల పాలనలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈ రోజు ఆ పని చేయగలిగింది. ఈ రోజు లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ గ్రామ స్థాయిలో ఇవ్వగలుగుతున్నాం.
సుపరిపాలన తీసుకువచ్చింది వైయస్ఆర్సీపీ, మీ జగనే అని చెప్పడానికి గర్వపడతున్నాను. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత పది సంవత్సరాల బ్యాంకు ఖాతాలను మీరే చూడండి. చంద్రబాబు ఐదేళ్ల పాలన, మన ఐదేళ్ల పాలనలో వారి బ్యాంకు ఖాతాల్లో ఏ ప్రభుత్వం ఎంత జమ చేసిందో గమనించమని అడగండి. చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి అయినా వేసిందా అని అడగండి. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో ఆ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, రైతుల బ్యాంకు ఖాతాల్లోకి, అవ్వతాతలకు ఎంత సొమ్ము ఇచ్చారో చూడమని అడగండి. కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా కూడా మీ బిడ్డ మీ ముఖాల్లో చూడాలని తపన, తాపత్రయంతో అడుగులు వేశారు. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంట్లో చెప్పండి.
వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెబుతున్నాను..ఇది మీ అందరి పార్టీ అని తెలియజేస్తున్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు..మీ అందరి పార్టీ అని తెలియజేస్తున్నాను.
మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడిని మాత్రమే అని తెలియజేస్తున్నాను.
కార్యకర్తలు, నాయకులను అభిమానించింది మీ బిడ్డ పాలనలోనే జరిగింది. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను చేసింది మీ అన్నకే సాధ్యమైంది. గతంలో చంద్రబాబు పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే పదవులు అంటూ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే, మనందరిలో ఒక్కరైన మనలో చదువుకున్న పిల్లలను తీసుకువచ్చి వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి లంచాలు లేకుండా ప్రతి పథకాన్ని పేదలకు అందించాం. మనందరితో కలిసి ఈ రోజు గ్రామ స్థాయిలోనూ, మండల స్థాయిలో ప్రజాప్రతినిధులతో అనుసంధానం అయి అందరికీ మేలు చేస్తున్నది మన ప్రభుత్వమే అని గర్వంగా చెబుతున్నాను.
చాలా సందర్భాల్లో కొంత మంది నాయకులకు అనిపిస్తుంది. జగనన్న వలంటీర్లకు అధికారం ఇచ్చారని అనిపిస్తుంది. ఆ వలంటీర్లు కూడా మనల్ని అభిమానించే వారు. మన పార్టీని అభిమానించే వాళ్లే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ప్రతి పథకాన్ని కూడా పేద కుటుంబానికి అందిస్తున్న వారు వలంటీర్లు. ఈ వలంటీర్లు మనలో ఒకరు, మన వారిలో ఒకరు . ఇలా మంచి చేయగలిగాం కాబట్టే ఈ రోజు మీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మేజరిటీతో గెలిపించి ఆ స్థానంలో కూర్చోబెడతారు. మన పార్టీని అభిమానించే వారికి నామినెటెడ్ పదవులు, పనుల్లో అవకాశం కల్పించాం. అన్నింటిలోనూ జగన్‌ను నమ్మిన వారికి, వైయస్ఆర్సీపీలో కష్టపడిన వారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా అవకాశం ఇవ్వని విధంగా మన పార్టీ అవకాశం కల్పించింది. మన 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టే..ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరఫున నామినేషన్ వేస్తే చాలు ప్రజలు ఆశీర్వదించి ఇంతకంటే గొప్ప అవకాశం ఇస్తారు. దటీజ్ మన వైయస్ఆర్సీపీ.
రూ.2.53 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు ఎవరూ లంచాలు అడగడం లేదు. వివక్ష చూపడం లేదు. నేను గర్వంగా చెబుతున్నాను. 84 శాతం మంది, ఇళ్లకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగింది. గ్రామాల్లో 92 శాతం ఇళ్లకు మంచి జరిగింది. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ అందరికీ ఈ రోజు ఒక్కటే చెబుతున్నాను. ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ మీ బిడ్డకు కుతంత్రాలు, కుట్రలు చేయడం తెలియదు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం మీ బిడ్డకు తెలియదు. పొత్తులు, ఎత్తులను నమ్ముకోలేదు. పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. మీకు మంచి జరిగింది కాబట్టి మీరే సైనికులుగా నిలబడండి. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ రావాలని కోరండి. ప్రతి కుటుంబం నుంచి బయటకు వచ్చిన వీరు..మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెప్పండి. మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా ఉండాలని చెప్పండి.
మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు చెప్పండి..ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంఫార్టెంట్ అని చెప్పండి. ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని చెప్పండి. ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్ వారిని నడిపించే భవిష్యత్..ఈ ఎన్నికల్లో మీ ఓటుతో పేదల భవిష్యత్ మారుతుందని చెప్పండి. ఈ ఎన్నికల్లో జగనే రావాలని చెప్పండి. పేదవాడు చదువుతున్న బడులు మారాలంటే జగన్ రావాలని చెప్పండి. మన పిల్లల చదువులు ప్రపంచంతో పోటి పడి చదవాలంటే జగన్ రావాలని చెప్పండి. అవ్వాతాతలకు చెప్పండి..అందరికీ అర్థమయ్యేలా చెప్పండి 1వ తేదీ నేరుగా మీ ఇంటికి రావాలంటే జగన్ గెలిస్తేనే జరుగుతుందని చెప్పండి.
ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతుకు చెప్పండి, మన గ్రామానికే వైద్యులు వస్తున్నారని చెప్పండి. ఈ పరిస్థితులు కొనసాగాలంటే..వైద్యం కోసం అప్పులపాలు కాకూడదంటే మీ జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పండి. ఆర్థిక స్వావలంబన రావాలంటే మీ జగనే ముఖ్యమంత్రి కావాలని చెప్పండి. రైతు భరోసా సొమ్ము ప్రతి ఏడాది మీ చేతికి అందాలన్నా, మీకు ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని ప్రతి రైతుకు చెప్పండి. మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి. మన పిల్లలు నిటారుగా నిలబడి అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడేలా తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పండి. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి భవిష్యత్ కావాలంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండాలి.
చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకువచ్చారని చెప్పండి. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, బెంజి కారు ఇస్తామని మోసం చేస్తారు. కానీ విశ్వసనీతయకు అర్థం తెచ్చింది మీ బిడ్డ మాత్రమే అని చెప్పండి. మీ బిడ్డ చేయగలిగింది మాత్రమే చెబుతాడు. చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఈ 56 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, డీబీటీ స్కీమ్‌లు కొనసాగాలంటే మీ జగనే సీఎంగా ఉండాలి అని చెప్పండి. లంచాలు, వివక్షతో కూడిన మళ్లీ జన్మభూమి కమిటీలకు ఓటు వేయవద్దని ఇంటింటికి వెళ్లి చెప్పండి. పొత్తు లేకుండా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని వీరంతా ఓటి కుండకు అరుపులెక్కువ, చేతకాని వాడికి అరుపులెక్కువ అన్నట్లుగా సామెత ఉంది.
ఇలాంటి దిగజారుడు పార్టీలు మీ జగనన్నను టార్గెట్‌గా, పేదవాడే టార్గెట్‌గా, వైయస్ఆర్సీపీ టార్గెట్‌గా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ యుద్ధానికి మీరు సిద్ధమా? ..నేను సిద్ధం..దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం, మీరు సిద్ధమా ..వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాధం చేస్తూ ఎన్నికల శంఖరావం పూరిస్తూ వైయస్ఆర్సీపీ ఎన్నికలకు సిద్ధం. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా? దుష్టచతుష్టాయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? వచ్చే ఎన్నికలకు వారి వంచన, మన విశ్వసనీతయతకు మధ్య జరుగుతున్న యుద్ధం, వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం, వచ్చే ఎన్నికలు సంక్షేమ పథకాలు రద్దు చేసే కుట్రలకు, మన సంక్షేమ పథకాలకు మధ్య యుద్ధం, వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే.
ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా?..ఈ 70 రోజులు ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పని చేయాలి.ప్రతిపక్షం చేస్తున్న దాడులను, ఎల్లోమీడియాలో, సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మీ చేతుల్లో ఉన్న సెల్ఫోన్లే మీ అస్త్రాలే. ఆ సోషల్ మీడియాను మీరే శాసించేది. సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి..అందుకు మీరంతా సిద్ధమేనా? కారణం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 స్థానాలు. 25 ఎంపీ స్థానాలకు 25 స్థానాలు ఎందుకు రావు అని అడుగుతున్నాను. ప్రతి ఇంట్లో మంచి జరిగినప్పుడు ఎందుకు ఈ టార్గెట్‌ను చేరుకోలేము. మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. ఈ యుద్ధంలో సిద్ధం అంటూ మీరంతా తోడుగా ఉండేందుకు సిద్ధమా?..
మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరికి భయపడడు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖరావం మోగించారు.