Search
Close this search box.
Search
Close this search box.

కేసుల విచారణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు డీఎస్పీలు అత్యంత కీలకమైన బాధ్యత నిర్వహించాలి

: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలి

నిజాయితీగా, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి

 హోంశాఖ & విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత

అనంతపురం, అక్టోబర్ 23 :అనంత జనశక్తి బ్యూరో 

అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 28 మంది ప్రొబేషనరీ డీఎస్సీల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత, డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా హోంశాఖ & విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు మీరు పోలీస్ శాఖలోకి డిఎస్పీలుగా ప్రవేశించబోతున్నారు. ఇది చాలా గౌరవప్రదమైన ఉద్యోగం. మన పోలీసు వ్యవస్థలో డీఎస్పీలు అత్యంత కీలకం. కేసుల విచారణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు చాలా డీఎస్సీలది అత్యంత కీలకమైన బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. ఒక వైపు ఉన్నతాధికారుల నిర్ణయాలను అమలు చేస్తూ మరో వైపు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది చేత సమర్ధవంతంగా పనిచేయించాల్సిన బాధ్యత డీఎస్సీలపైన ఉంటుంది. అలాంటి కీలకమైన డీఎస్సీలుగా విధుల్లో చేరుతున్న మీరంతా మన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని కోరుతున్నానన్నారు.మరంతా…ఏ. ప్రాంతంలో పనిచేసినా… ఆదర్శమైన అధికారులుగా పేరు తెచ్చుకునేలా పనిచేస్తారని నమ్ముతున్నాను. ఈ ఉద్యోగంలో చేరడానికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మీరు మీ డ్యూటీని నిజాయితీగా, సమర్ధవంతంగా నిర్వర్తించడంతో పాటు ప్రజలకు నిష్పక్షపాతంతో కూడిన సేవలను అందించాలి. డీఎస్పీ అంటే…డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్..గా అందరం పిలుస్తాం.. కానీ మీరు మీ పనితీరుతో డీఎస్పీ అంటే….డెడికేటెడ్ సక్సెస్ ఫుల్ పోలీస్ గా, డైనమిక్ అండ్ సెన్సిబుల్ పోలీస్ గా పేరు తెచ్చుకోవాలి.ఏ ప్రాంతంలో ఎన్నాళ్లూ పనిచేస్తారన్నది కాదు.. అక్కడ పనిచేసి బదిలీ అయి వెళ్లిన తరువాత కూడా ఎన్నాళ్లయినా కూడా మిమ్మల్ని మర్చిపోనంత మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశానికే అనేక విషయాల్లో ఆదర్శంగా నిలిచింది. అలాంటి పోలీస్ శాఖలో బాధ్యతలు చేపడుతున్న మీరు..మీ బాధ్యతగా ఆ కీర్తి మరింత పెరిగేలా పనిచేయాలని కోరుతున్నాను. ఆంధ్రపోలీస్ అంటే…ఈ దేశంలోనే ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ …… పెంచేందుకు మీ వంతు కృషి మీరు మొదటి రోజు నుండే చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజల్లో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని రెట్టింపు చేసేలా పనిచేయాలని కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది. మన రాష్ట్రంలో ఎటువంటి మత ఘర్షణలు కానీ, ప్రాంతీయ వైషమ్యాలు కానీ, కులాల మధ్య ఘర్షణలు కానీ, సరిహద్దు తీవ్రవాద చర్యలు కానీ జరగకుండా చాలా పటిష్టంగా మన ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశంలో పోలీస్ శాఖ పనిచేస్తోంది. ఇదంతా డీజీపీ గారి నుండి మొదలుకొని క్షేత్రస్థాయి అధికారి వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయడం వల్లనే సాధ్యం అయ్యిందని హోంమంత్రిగా ఈ వేదిక నుండి గర్వంగా చెప్పగలను.నేడు సమాజంలో మార్పులు ఎంత వేగంగా వస్తున్నాయో… నేరాలు కూడా అలానే అంతే వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో అంతకు రెట్టింపు స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సమూలమైన మార్పులతో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తున్నారు. నేరాలను అరికట్టడానికి, చట్టాలను అమలు చేయడంలో మన పోలీసు శాఖ చాలా ప్రగతి సాధించింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తొలిసారిగా మహిళల భద్రత, రక్షణ కోసేం మహిళల పట్ల జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు మన ముఖ్యమంత్రిగారు దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్, ప్రత్యేక కోర్టులు వంటివి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 1.43 కోట్లు, దిశ కాల్స్ 10.58 లక్షలు, కాల్స్ ఆధారంగా సేవలు అందించి నమోదు చేసిన FIR లు 2,923… పోలీసుల సేవలు, సహాయం పొందినవారు 30,500 మంది… ఇవేకాకుండా జీరో ఎఫ్ ఐ ఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో కీలకమైన మూల స్తంభాలైన ఫోరెన్సిక్, మెడికల్,, ప్రాసిక్యూషన్, ట్రైల్, ప్రత్యేక న్యాయస్థానాల అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంది.నూతనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ ను నియమించడం జరిగింది. ఈ నియామకాల ద్వారా వేగంగా కేసులు దర్యాప్తుజరపడంతో పాటు సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు, DNA రిపోర్ట్, నిర్ణీత సమయంలో పోస్ట్ మార్ఖం, అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్ మన పోలీస్ శాఖ పొందగలుగుతోంది. దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత సమయంలో న్యాయస్థానల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ద్వార నేరస్తులను ఖఠినంగా శిక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వసతులతో కూడిన దిశ పోలీస్ స్టేషన్ ల ప్రారంభించడంతో మహిళలకు, చిన్నారులకు బరోసా కల్పిస్తూ మెరుగైన సేవలను అందిస్తోంది మన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్, దిశ SOS, ప్రత్యేక న్యాయస్థానాలు, DNA LABS సైబర్ లాబ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి.దిశ పోలీస్ స్టేషన్ లో డి యస్ పి స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు మహిళల కోసం ప్రత్యేకంగా సిబ్బంది.. ప్రాధమిక చికిత్స కోసం వైద్యులు, దిశ సెంటర్స్, దిశ పెట్రోలింగ్, దిశ ఫోరెన్సిక్ మొబైల్ వాహనం, ప్రతి పోలీస్ స్టేషన్ లో దిశ సైబర్ నిపుణులను అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది.ఇలాంటి చర్యలు తీసుకోవడం, పోలీస్ శాఖని మన ముఖ్యమంత్రి ఆధునీకరించడంతో మహిళలపై జరుగుతున్న నేరాలపై నమోదైన కేసుల్లో 93.7 శాతం వారం రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలుచేసి నిందితులకు న్యాయ స్థానంలో శిక్షలు విధించడంతో భాదితులకు సత్వర న్యాయం లభిస్తుంది. ఈ ఫలితాలు సాధించడానికి ప్రధాన కారణం మన పోలీస్ శాఖ, పోలీసులు ఆకింతభావం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ లేదంటే.. ఇంత మంచి ఫలితాలు సాధించలేం… ఈరోజు డిఎస్సీలు గా బాధ్యతలు చేపట్టే మీరు కూడా ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పనిచేయాలని కోరుతున్నాను.ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తూ అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు పోలీస్ శాఖ ప్రతినిధిగా ఉండి, పోలీస్ సేవలను ప్రతి గ్రామంలోని మారుమూల ఇంటికి సైతం అందించేందుకు అనుగుణంగా గ్రామ, వార్డ్ సచివాలయల్లోని 15,000 మంది మహిళ సంరక్షణ కార్యదర్శులుగా మహిళా పోలీస్ లుగా గుర్తిస్తూ వారి సేవలను వినియోగించుకుంటుంది. ఈ రోజు శిక్షణ పూర్తి చేసుకున్న డిఎస్పీలందరికి నా సందేశం ఏమిటంటే, మీరు ప్రజలకు మంచి సేవలందించాలి. అన్ని వేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మీరు ఈ ఉద్యోగంలో ప్రజలకు మంచి సేవలను అందిస్తూ వారి అభిమానాన్ని, నమ్మకాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి  మాట్లాడుతూ….ఇక్కడ నేర్చుకున్నదానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందర్నీ సమానంగా చూస్తూ విచక్షణతో మెలగాలి. ఇగోయిజం దరిదాపుల్లో ఉండకూడదు. అన్ని వర్గాలు ప్రజలతో సత్సంబంధాలు కల్గి ఉండి అందర్నీ సమన్వయపరుచుకుని చట్టపరంగా ముందుకెళ్లాలి.. మన ప్రవర్తన సరిగా లేకపోతే ప్రభుత్వం, పోలీసుశాఖ, కుటుంబాలకు చెడ్డ పేరు వస్తుందని గుర్తుంచుకోవాలి. ఏ ఒక్కరి నుంచీ కూడా వ్యవస్థ ఇబ్బంది పడకూడదు… ఒత్తిడికి లోనుకాకుండా సాఫీగా, పారదర్శకంగా పని చేయాలి. ఎవరైనా బాధితులు న్యాయం కోసం మన వద్దకు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి సకాలంలో చర్యలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో జాప్యం ఉండకూడదు. మహిళల సమస్యలలో కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. మన ప్రవర్తన బాగుండాలి. పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజల మానసిక ఆలోచనలకు అనుగుణంగా చట్టపరంగా వ్యవహరించాలన్నారు.పోలీసుల మెరుగైన పనితీరుకు ఉదాహరణ ఇటీవల ఏలూరులో అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది. తక్షణమే స్పందించి ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడేందుకు అన్నీ ప్రయత్నాలు చేశాము కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోయింది. కానీ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేవలం నిందితులకు మూడున్నర నెలల కాలంలోనే ముగ్గురు నిందితులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడేలా కృషి చేశాం. అమ్మాయి కుటుంబానికి పరిహారాన్ని కూడా అందించాము.రాష్ట్రంలో గత ఏడాది 122 కీలక కేసుల దర్యాప్తుల పర్యవేక్షణను జిల్లాల ఎస్పీలకు అప్పగించాం. ఈ కేసులన్నింటిలోను శిక్షలు పడటం ముదావహం. ఈ సంవత్సరం కూడా ఎస్పీలకు ఒక్కొకరికి 50 కేసులను అప్పగించగా ఇప్పటికే 30 వరకు కేసుల్లో తీవ్ర శిక్షలు పడ్డాయి. మహిళల భద్రత కోసం దిశ యాప్, అవినీతిని నిరోధక అప్లికేషన్ లు ఉన్నాయి. వాటిని విజయవంతంగా నిర్వహించాలి. దిశయాప్ లో ఇప్పటికే 1,24 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ భారీగా టెక్నాలజీని వినియోగిస్తోంది. టెక్నాలజీ వినియోగంలో ముందు స్థాయిలో ఉంచుతున్నాం. ఫలితాలు కూడా అలానే వస్తున్నాయి. సోషల్ మీడియా పోకడలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేశాం. అదే తరహానే జిల్లాలో కూడా ప్రత్యేక టీంలను సిద్ధం చేశాం. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. లోన్ యాప్ లు, జాబ్ ఫ్రాడ్స్ లపై నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. గంజాయి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నాం. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో కూడా ప్రత్యేక నిఘా వేశాము. కష్టపడి పని చేయాలి. పోలీసులకు సంబంధించిన ప్రతీ రికార్డు పట్ల అవగాహన కల్గి ఉండాలి. గ్రేవ్ కేసుల దర్యాప్తుల్లో నైపుణ్యం సాధించాలి. శిక్షణ సమయంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్ డోర్ విభాగాలలో రాణించిన, ప్రతిభ కనపరిచిన, ప్రొబేషనరీ డీఎస్పీలకు రాష్ట్ర హోంశాఖామాత్యుల చేతుల మీదుగా పతకాలు, ట్రోఫీలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం పిటిసి ప్రిన్సిపాల్ & ఐజీపి వెంకట్రామిరెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి గీతాదేవి, అనంతపురం ఉమ్మడి జిల్లాల ఎస్పీలు,కేకేఎన్ అన్బురాజన్ , ఎస్వీ మాధవరెడ్డి , తాడిపత్రి బెటాలియన్ కమాండెంట్ గంగాధర్ రావు, అనంతపురం ఎంపి తలారి రంగయ్య, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ శ్రీమతి బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం, రిటైర్డ్ ఐజి శ్రీ సూర్యప్రకాష్, అదనపు ఎస్పీలు జె.మల్లికార్జునవర్మ, ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, డీఎస్పీలు అల్లాబకాష్, హరినాథ్ రెడ్డి, శ్రీనివాసులు, నాగభూషణ, దేవదాస్, బి.శ్రీనివాసులు, సీఎం గంగయ్య, నరసింగప్ప, పలువురు సి.ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, ప్రొబేషనరీ డీఎస్పీల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి