రాష్ట్రంలో వైసీపీ ముఠా దోపిడీ 3.20 లక్షల కోట్లు.
ప్రభుత్వానికి పావలా వస్తే..తాడేపల్లి ప్యాలెస్ కు ముప్పావలా ఆదాయం వస్తోంది
టీడీపీ వచ్చాక జగన్ అవినీతిపై విచారణ
జగన్ ది సంక్షేమం కాదు..సంక్షోభం
ప్రభుత్వ సొమ్ము జీతంగా తీసుకునే సీఐడీ అధికారులు చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారు.?
రాజమహేంద్రవరం :- అనంత జనశక్తి బ్యూరో
నాలుగున్నరేళ్లలో వైసీపీ రూ.3.20 లక్షల కోట్లు దోచుకుందని, ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ అవినీతిపై టీడీపీ వచ్చాక విచారణ చేయిస్తామని, తప్పుడుకేసులు కాకుండా వాస్తవాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో లోకేష్ క్యాంప్ సైట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ ప్రభుత్వానిది సంక్షేమం కాదు..సంక్షోభం. కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులకు వచ్చిన లక్షా పదివేల కోట్లను పక్కదారి పట్టాంచారు. గ్రామ పంచాయతీలకు చెందిన రూ.8,600 కోట్లు, నరేగాలో రూ.32వేల కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. రూ.42 వేల కోట్లతో రెండు విడతల్లో పూర్తవ్వాల్సిన జల్ జీవన్ మిషన్ ఆగిపోయింది. ఆరోగ్య సురక్ష కేంద్ర పథకం..దాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ రిబ్బన్లు కట్ చేస్తున్నారు. లిక్కర్ లో యేడాదికి రూ.6 వేల కోట్లు దోచుకున్నారు. రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి..ఆఖరి విడత కూడా పెంచలేదు. 60 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు రూ.22 వేల కోట్లు నష్టపోయారు. ఇసుకకు రసీదు ఇవ్వకుండా దొంగ వే బిల్లులు ఇస్తున్నారు. ఇసుకలో రూ.25 వేల కోట్లు దోచుకున్నారు. రూ.54 వేల కోట్లు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడమే కాకుండా…విద్యుత్ కొనాలన్న నెపంతో రూ.25 వేల కోట్లు దోచుకున్నారు. బొగ్గు, విద్యుత్ కొనుగోలుకు అధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి పావలా ఆదాయం వస్తే..తాడేపల్లి ప్యాలెస్ కు ముప్పావలా వెళ్తోంది. విశాఖ కేంద్రంగా భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. భూ రికార్డులు తారుమారు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారు. పది లక్షల విలువ చేసే భూమిని రూ.50 లక్షలు పెట్టి కొని ఇళ్ల పట్టాలంటూ దోచుకున్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసమే చంద్రబాబును జైల్లో పెట్టించారు. ఏ కాంట్రాక్టర్ ను కదిలించినా పనులు చేయడం లేదు..పులివెందుల బ్యాచ్ కు మాత్రమే పనుల బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యుత్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నీటి పారుదల రంగం కుదేలై పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు 9 గంటలు విద్యుత్ ఇవ్వాలి. పంట నష్టపోయిన రైతులుకు పరిహారం ఇవ్వాలి’’ అని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
#GBC_Office