క్రమ శిక్షణతో విధులు నిర్వహించండి….
—– జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి
—– హోంగార్డ్స్ కు పిలుపునిచ్చిన హోంగార్డ్స్ కమాండెంట్ యమ్. మహేష్ కుమార్
—- సమిష్టి విధులతో ప్రజలకు మెరుగైన సేవలందించండి
పుట్టపర్తి,అక్టోబర్ 09,అనంత జనశక్తి న్యూస్:
శ్రీసత్యసాయి యూనిట్ లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్తో పెరేడ్ మరియు దర్బార్ నిర్వహించారు,క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కంమండంట్ పిలుపునిచ్చారు. హోంగార్డ్స్ తో దర్బార్ ను నిర్వహించిన కార్యక్రమంలో కమాండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం స్థానిక పరేడ్ మైదానంలో
కమాండెంట్ హోంగార్డ్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ..
ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలని, హోంగార్డ్స్ ల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యాంగా ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు..
విధుల్లో నైపుణ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని, పలు మెళకువలు సూచించారు. అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ అవుతున్నాయా లేదా చూసుకొంటూ ఉండాలని, ఏదైనా సమస్య వస్తే సబ్ డివిజన్ ఇంచార్జీ ల ద్వారా పరిష్కారం పొందాలని, లేదా ఆర్ఐ కి సమస్యను తెలియజేసి పరిష్కరించుకోవాలని, విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్ధేశం చేశారు. ప్రతి హోంగార్డును వారి ఉన్న సమస్యలను నేరుగా వారి మధ్యకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ అందరికీ ప్రశంస పత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో డి ఎస్ పి.విజయ్ కుమార్,ఆర్ ఐ సి. రాజ శేఖర్, బిహెచ్ బి ప్రదీప్ సింగ్, ఏఎస్ఐ శ్రీరాములు, సబ్ డివిజన్ల హోంగార్డ్స్ ఇంచార్జీ, మరియు హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.