నారా లోకేష్ బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి
—— సంఘీభావం తెలిపిన పల్లె రఘునాథ్ రెడ్డి,సామకోటి ఆదినారాయణ
పుట్టపర్తి,ఆగష్టు 31,అనంత జనశక్తి న్యూస్:
పుట్టపర్తి మండల కేంద్రంలో చేపట్టినటువంటి యువ గళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబుకి మద్దతుగా పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి,సామకోటి ఆదినారాయణ లు సంఘీభావం తెలిపారు, అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఈ సంధర్భంగా జనవరి 27న మొదటి అడుగుతో మొదలెట్టిన యువగలం పాదయాత్ర ఈరోజుకి వంద రోజులు పూర్తి కావడంతో వారికి సంఘీభావంగా పుట్టపర్తి నియోజకవర్గం కప్పలబండ నుండి మామిళ్ల కుంట క్రాస్ వరకు ఈ పాదయాత్రతో సంకీభవం తెలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ఈ పాదయాత్ర విజయవంతం చేశారని వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.