కష్టాల్లో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటాం
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం ఆగస్ట్ 17,అనంత జనశక్తి న్యూస్
కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. స్థానిక 46వ డివిజన్‌కు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త పెనుగొండ రామసీత భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున నెల రోజులకు సరిపడే ఖరీదైన మందులను అందచేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాధల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కష్టాల్లో ఉన్న రామసీత కుటుంబాన్ని, ఆమె భర్తకు మందులు అందించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ బిసి సెల్ ఉపాధ్యక్షులు అగురు ధన్ రాజ్, తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, నాయకులు పిడిమి ప్రకాష్, బొచ్చా శ్రీను, మొకమాటి సత్యనారాయణ, మండల రవి, కేబుల్ మురళి, మండల నాయుడు, అధిక సంఖ్యలో తెలుగు మహిళలు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.