Search
Close this search box.
Search
Close this search box.

భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం కృషి :  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం కృషి :

 ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

 

అనంతపురం ఆగస్ట్ 16,అనంత జనశక్తి న్యూస్

భవిష్యత్తు తరాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.అనంతపురం జిల్లా: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామంలో నూతన గ్రామ సచివాలయం, డా. వైయస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, గడ్డంవారిపల్లి గ్రామంలో డా. వైయస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.

బుక్కాపురం, కొడవండ్లపల్లి, ఆరవేడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఇంటింటికి ప్రజాప్రతినిధులతోనూ, అధికారులతో కలసి ప్రభుత్వం పథకాలు అందుతున్నాయా? లేదా అని ఆడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్దిని బుక్ లెట్ ద్వారా ప్రజలకు వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ… వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి గ్రామాల్లోని రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

కార్పొరేట్ కు దీటుగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య శాఖలో అనేక రకాల సంస్కరణలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అందిస్తూ కొడవండ్లపల్లిలో చిత్రకారుల లక్ష్మీదేవికి రూ.4,72,498 లక్షలు, బుక్కాపురంలో కె.హైమావతి రూ.5,06,650 లక్షలు, ఆరవేడులో రూ.జి. పెద్దన్న రూ.2,63,731 లక్షలు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరిందన్నారుఇ.చ్చిన హామీలన్నీ నెరవేర్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన జననేత ప్రజల గుండెల్లో జగనన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి