Search
Close this search box.
Search
Close this search box.

ప్రతి విద్యార్థికి ట్యాబ్ లు అందిస్తున్నాం: సీఎం

‘జగనన్న ఆణిముత్యాల’కు “సీఎం సత్కారం”

విజయవాడలో అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్‌

ప్రతి విద్యార్థికి ట్యాబ్ లు అందిస్తున్నాం: సీఎం

ప్రభుత్వ బడుల్లో నయా డిజిటల్ విద్యను తీసుకోచ్చాం

ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మెండ్స్, షైనింగ్‌ స్టార్స్, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీగా మన విద్యార్థులు

మీరు సీట్ తెచ్చుకోండి.. మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం ఉంటుందని భరోసా

ఏపీలోని విద్యా విప్లవంతో నిరుపేద వర్గాలు త్వరలోనే కూడా ప్రపంచాన్ని శాసించే రోజు

అమరావతి జూన్ 20,అనంత జనశక్తి ప్రతినిధి 

‘మాణిక్యాలన్నీ మట్టిలోనే పుడతాయి.. అరక దున్నినప్పుడే ఆ మాణిక్యాలు వజ్రాలై బయటపడతాయి. మట్టి నుంచి పుట్టి.. ఆ మట్టినే ఆధారంగా చేసుకుని పెరిగిన ఈ మొక్కలు మహావృక్షాలై ఎదిగినట్టు.. ఏపీలో మొదలైన డిజిటల్ విద్యా విప్లవంతో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నా.. చదువులమ్మ గుడులుగా మారుతున్న గవర్నమెంట్‌ బడుల నుంచి టెన్త్, ఇంటర్‌ టాపర్లుగా నిలిచిన ఆణిముత్యాలకు, మన భావి అంతర్జాతీయ పౌరులకు గుండెల నిండా ప్రేమతో మీ జగన్‌ మామ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాడు’’… సీఎం జగన్‌*

ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్‌మీడియ‌ట్‌ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు సీఎం జగన్ ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను అందించారు. విజయవాడ ఎ–కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం జరిగిన వేడుకలో సీఎం జగన్‌ విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లా ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌మైండ్స్, షైనింగ్‌ స్టార్స్, ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ, ప్రతిభ కనబర్చిన పిల్లలు, వారి తల్లిదండ్రులకు, వారికి గొప్పగా చదువులు చెప్పిన టీచర్లందరికి సీఎం జగన్ స్వాగతం పలికారు. 

ప్రతి విద్యార్థి ముఖంలో కాన్ఫిడెన్స్‌ కనిపిస్తోందని, ఈ పిల్లల్ని చూస్తుంటే గవర్నమెంట్‌ బడులు, కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక 

తనకు మరింత పెరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల దూరం కాకూడదని జగనన్న ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది కాబట్టే.. పిల్లలు వెళ్లే గవర్నమెంట్‌ బడి నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని సీఎం ఉద్ఘాటించారు. పిల్లలకు అందించే మిడ్‌డే మిల్స్‌ కూడా జగనన్న గోరుముద్దగా మార్పు చేసి అందించగలుగుతున్నామని బడులు తెరిచే సమయానికల్లా జూన్‌లోనే జగనన్న విద్యా కానుక ప్రతి చిట్టి తల్లి, బాబు అందుకుంటున్నారని చెప్పారు. 

*ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యా విప్లవంతో సదుపాయాలు, కరికులమ్ లో సమూల మార్పులు*

ఈ నాలుగేళ్లలోనే పిల్లలు చదువుకుంటున్న మీడియం ఇంగ్లిష్‌కు మారిందని, మొట్టమొదటి సారిగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల సిలబస్‌ మారిందని, బైలింగ్వెల్‌ టెక్ట్స్‌బుక్స్‌ తీసుకొచ్చామని, అంతేకాకుడా బైజూస్‌ కంటెంట్‌ కూడా గవర్నమెంట్‌ బడుల్లోని మన పిల్లలందరికీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. పిల్లలు చదువుతున్న బడుల్లో సదుపాయాలు, కరికుళం అన్నీ మారిపోయాయని అన్నారు. 

గతంలో క్లాస్‌ టీచర్లు ఉంటారో లేదో అనుకునే పరిస్థితి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లు 3వ తరగతి నుంచే బోధనలు చెప్పించే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడిన రోజులకి మనం వచ్చామని సీఎం హర్షం వ్యక్తం చేశారు. క్లాస్‌లలో డిజిటల్‌ బోధనకు 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌ లో ఐఎఫ్‌బీ బిగించి డిజిటల్‌ బోధనతో ప్రతి పిల్లాడికి, పాపకు చదువు అనేది ఇంకా ఎఫ్టెక్టివ్‌గా నేర్పించే కార్యక్రమం మన గవర్నమెంట్‌ బడుల్లో జరుగుతుందని తెలిపారు

*ప్రతి విద్యార్థికి ట్యాబ్ లు అందిస్తున్నాం*

8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడికి కూడా కంటెంట్‌ లోడెడ్‌ ట్యాబ్‌లను అందిస్తూ గవర్నమెంట్‌ బడుల్లో చదువుతున్న పిల్లలను ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మన పేదింటి పిల్లలందరూ కూడా అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3వ తరగతి నుంచి వారిని టోఫెల్‌ పరీక్షకు సిద్ధం చేస్తూ.. అంతర్జాతీయ సర్టిఫికేషన్‌ కూడా పిల్లలకు అందించే గొప్ప అడుగు మన గవర్నమెంట్‌ బడుల్లో పడుతుందని సీఎం పేర్కొన్నారు. పిల్లలు ఇంగ్లిష్‌లో వినడం, మాట్లాడటం రెండింటిలోనూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే పరిస్థితి తీసుకురావడం కోసం టోఫెల్‌ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. 

“గవర్నమెంట్‌ బడుల్లో ఇలాంటి మార్పులు రాగలుగుతాయా..? సాధ్యమయ్యే పనేనా అనే పరిస్థితి నుంచి ఇవన్నీ మన గవర్నమెంట్‌ బడులే.. గవర్నమెంట్‌ బడులతో ప్రైవేట్‌ బడులు పోటీపడక తప్పదు అనే పరిస్థితి నా ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి అన్నగా, తమ్ముడిగా వారి పిల్లలందరికీ మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ మనసా, వాచా, కర్మణా వారందరికీ తోడుగా నిలబడుతూ ఈరోజు మీ జగన్‌ మేనమామ ప్రభుత్వంలో ఇవన్నీ గవర్నమెంట్‌ బడుల్లో జరుగు తున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ డిగ్రీ చదవాలని జీఈఆర్‌ రేషియోలో ఇప్పుడున్న వాటికి మార్పులు రావాలని ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలని, డిగ్రీతో బయటకు రావాలిని సీఎం తన అభిలాష వ్యక్తపరిచారు. ఈ డిగ్రీతో బయటకు వచ్చే కార్యక్రమంలో పేద పిల్లవాడి కోసం వారి తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా ఆ ప్రతి పిల్లాడికి డిగ్రీ సర్టిఫికెట్‌ చేతిలో ఉండాలనే తపన, తాపత్రయంతో దేశంలో ఎక్కడా జరగని విధంగా విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం పేర్కొన్నారు.

*మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది*

“డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ వంటి చదువులకు మొత్తం ఫీజులన్నీ మన ప్రభుత్వమే భరిస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా.. ప్రపంచంలో టాప్‌ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్‌లో దాదాపుగా 350 విదేశీ కాలేజీల్లో ప్రతి పిల్లాడికి చెప్పాం.. మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏకంగా ఫీజులు రూ.1.25 కోట్లు అయినా కూడా మీరు భయపడాల్సిన పనిలేదు.. సీటు తెచ్చుకుంటే మీకు తోడుగా మీ మేనమామ ప్రభుత్వం ఉంటుందని ప్రతి పాపకు, బాబుకు భరోసా ఇచ్చాం” అని సీఎం హమీ ఇచ్చారు.

*క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మీదే ధ్యాసపెట్టాం*

మన పిల్లలందరూ ప్రతి రంగంలోనూ ఎదగాలిని, ఎదగడమే కాకుండా ఎగరాలని ప్రపంచంలో వస్తున్న ఇన్వెన్షన్, ఇన్నోవేషన్స్‌ను అనుసరించేలా మనవాళ్లు ఉండకూడదని, ప్రతి రంగంలోనూ ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నామని సీఎం తెలిపారు. ఇది జరగాలంటే క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో మార్పు రావాలని పేర్కొన్నారు. అందుకనే ఈ నాలుగు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పెట్టిన ధ్యాస దేశంలో బహుశా ఎవరూ పెట్టిఉండరని, అంతగా క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మీద ధ్యాసపెట్టామని సీఎం అన్నారు. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్‌ బడుల్లో ఐబీ సిలబస్‌ కూడా తీసుకువచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందిని తెలిపారు.

పరీక్షల పేపర్లు రాసే పరిస్థితిని కూడా మార్చాలిని చెప్పారు. పరీక్షలంటే కేవలం చదువుకొని, ఆన్సర్స్‌ను మెదడులోకి డ్రిల్‌ చేసి రాయడం కాకుండా.. ఇంటర్నేషనల్‌ ఎగ్జామ్స్‌ మాదిరిగానే మన పిల్లలకూ పరీక్షలకు వెళ్లేటప్పుడు టెక్ట్స్‌బుక్‌ కూడా మీరు తీసుకు వెళ్లొచ్చని, ప్రాక్టికాలిటీకి దగ్గరగా, క్వశ్చన్స్‌ అన్నీ అనలెటికల్‌గా ఇంటర్నేషనల్‌ సిలబస్‌లో ఏ మాదిరిగా పరీక్ష పత్రాలు ఉంటాయో ఆ మాదిరిగా కూడా మన పరీక్షా పత్రాలు కూడా రాబోయే రోజుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు

*విద్యతో త్వరలోనే నిరుపేద వర్గాలు కూడా ప్రపంచాన్ని శాసించే రోజు*

ప్రభుత్వ పాఠశాలల్లో అట్టడుగున ఉన్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు చదువుకుంటున్నారని, ఈ పిల్లలంతా ప్రపంచాన్ని ఏలే రోజు త్వరలోనే వస్తుందని ఆకాంక్షించారు. ఆ రోజును కచ్చితంగా మనం చూస్తామని తెలిపారు. నిరుపేద వర్గాలు రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి మన పిల్లలు వెళ్తారని ఉద్ఘాటించారు. 

*ప్రపంచాన్ని శాసించబోయే టెక్నాలజీని మన పిల్లలు చదువుకోవాలి*

ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషిన్‌ లెర్నింగ్, ఎల్‌ఎల్‌ఎం, చాట్‌ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ.. మనం ఎదగాలనే ఆలోచనలు రావాలని ఆ దిశగా చదువులు మారతాయని వెల్లడించారు. ఆ స్థాయిలో మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎల్‌ఎల్‌ఎం, చాట్‌ జీపీటీ యుగంలో ఎడ్యుకేషన్‌ రంగమే పూర్తిగా మారుతుందని, ఈ మార్పును ప్రతి పేదవాడికి తీసుకురావాలని, ప్రతి పేద కుటుంబం కూడా ఈ మార్పుల్లో భాగస్వామ్యం కావాలిని అప్పుడే మనం ప్రపంచాన్ని ఏలగలుగుతామని ప్రతి పిల్లాడూ గుర్తుపెట్టుకోవాలని పిల్లలకు సీఎం దిశానిర్దేశం చేశారు. 

*ర్యాంక్‌లు తెచ్చుకున్నవారే కాదు.. ఏ ర్యాంక్‌ తెచ్చుకోలేని వారు కూడా నాకు ప్రాధాన్యమే..*

టాప్‌ ర్యాంక్‌లు తెచ్చుకున్న విద్యార్ధులే కాకుందా ఏ ర్యాంక్‌ తెచ్చుకోలేని వారు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్‌ అని సీఎం తెలిపారు. సంకల్పం అనేది గట్టిదైతే రిజల్ట్స్‌ ఆటోమెటిక్‌గా వస్తాయని వారు కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మాణిక్యాలన్నీ మట్టిలోనే పుడతాయని అరక దున్నినప్పుడే వజ్రాలు బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలని సీఎం అన్నారు.

“గవర్నమెంట్‌ స్కూల్స్, కాలేజీల్లో చదువుకొని ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, ఆయా స్కూళ్లు, కాలేజీల స్థాయిల్లోనూ నాలుగు కేటగిరీస్‌లో టాప్‌–3గా నిలిచిన పిల్లలు బాగా చదువుకోవాలని, మరింతగా రాణించాలని, మిగిలిన పిల్లలకు వీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ వీరందరినీ రాష్ట్రానికి పరిచయం చేస్తూ అడుగులు వేస్తున్నాం. ఈ నాలుగు స్థాయిల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది ఆణిముత్యాలుగా నిలిచిన మొత్తం 22,768 మంది పిల్లలను సత్కరించడం జరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సన్మానం, ఇది పరోక్షంగా గవర్నమెంట్‌ బడికి, ఆ బడుల్లో పాఠాలు చెబుతున్న టీచర్లకు సన్మానం. మరోసారి మీ అందరికీ బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

నేటి నుంచి అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటామని, ఈ సంవత్సరం కంటే వచ్చే ఏడాదికి క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో ఇంకా గొప్ప మార్పులు చూపిస్తామని సీఎం తెలిపారు. ఇంకా బెటర్‌ రిజల్ట్స్‌తో ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నానని ఆకాక్షించారు. తాను సత్కరించే 88 మంది పిల్లల్లో ఎస్‌ఎస్‌సీలో బాలురు 18 మంది ఉంటే.. బాలికలు 24 మంది ఉన్నారని, ఇంటర్మీడియట్‌లో బాలురు నలుగురు ఉంటే బాలికలు 22 మంది ఉన్నారని, ఇది నిజంగా ఆడపిల్లలను బడులకు పంపించాలని ప్రతి తల్లిదండ్రిని ప్రోత్సహించే గొప్ప నంబర్‌ అని తెలియజేస్తున్నాని సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి