సత్యసాయి బాబా జయంతి వేడుకలకు
రాష్ట్రపతి ,గవర్నర్ రాక
—– భద్రత ఏర్పాట్లపై ప్రాథమికంగా సమీక్షించిన జిల్లా ఎస్పీ
—– సత్య సాయి బాబా జయంతి వేడుకలకు పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లు ..
—– ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుస్తూ జాగ్రత్తలు
శ్రీ సత్య సాయి జిల్లా బ్యూరో,నవంబర్ 11,అనంత జనశక్తి న్యూస్:
శ్రీ సత్య సాయి బాబా 98, జయంతి వేడుకల కు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , గవర్నర్ అబ్దుల్ నజీర్ లు రానున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ఎస్ వి .మాధవ్ రెడ్డి ఐపీఎస్ ముందస్తు పోలీస్ భద్రత ఏర్పాట్లపై ప్రాథమికంగా ట్రస్ట్ అధికారులు, రెవిన్యూ అధికారులతో శనివారం సమీక్షించారు.
ప్రశాంతి నిలయం , పుట్టపర్తి ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ, శ్రీసత్యసాయిబాబా 98వ జయంతి వేడుకలకు పటిష్ట పోలీస్ కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లు చేయనున్న నేపథ్యంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ శనివారం , జెసి ,ఆర్డిఓ ,ట్రస్ట్ సభ్యులు పోలీస్ అధికారులతో కలిసి పోలీస్ భద్రత ఏర్పాట్లపై ప్రాథమికంగా సమీక్షించారు. అనంతరం, ప్రశాంతి నిలయంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టాలా అన్న విషయాలపై ఎస్పీ పర్యటించారు. పుట్టపర్తి పట్టణంలో ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలన్న వాటిపై చర్చించారు. అనంతరం పోలీస్ అధికారులతో కలసి పరిశీలించారు. వేడుకల నిర్వహణ పోలీసులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలీస్ అధికారులతో చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. . ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై ఎస్పీ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలను విజయవంతం చేసేందుకు ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుండి భక్తాదులు ప్రజలు పాల్గొనే అవకాశం ఉంటుందని అందువల్ల ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా చూడాలన్నారు. ,వివి.ఐ.పీల ప్రోటోకాల్ విధులు, తదితర ముఖ్య అంశాలపై దృష్టిని సారించాలని అధికారులకు సూచించారు. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించి బాబా జయంతి వేడుకలు సజావుగా జరిగే విధంగా కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీసు శాఖ ద్వారా పట్టిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ ,పార్కింగ్ సమస్య కలెత్తకుండా నియంత్రణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో తెలియజేశారు. గణేష్ గేట్ గోపురం,వెస్ట్ గెట్ ,శాంతిభవన్ , సాయి కుల్వంత్ , భోజన సముదాయాల శిబిరాలు, ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల లోపల మరియు బయట గట్టి బందోబస్తు చేపట్టాలన సూచించారు. ప్రముఖులు వచ్చే ప్రధాన రహదారి కాన్వాయ్ రూటును , అనంతరం పట్టణంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయో పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ చిత్రావతి రోడ్ పుట్టపర్తి ప్రధాన రహదారి తదితర ప్రాంతాలలో , పోలీసు అధికారులతో కలిసి పర్యటించారు.
ఈనెల 18 నుండి 24 వరకు శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న
నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు.
ఎస్పీతో పాటు , జెసి చేతన్, ఆర్డీవో భాగ్యరేఖ అదనపుఎస్పీ విష్ణు , డీఎస్పీ వాసుదేవన్, ఏ ఆర్ డి ఎస్ పి.విజయ్ కుమార్, ఎస్బిసిఐ, రవీంద్రారెడ్డి, పట్టణ సిఐ కొండారెడ్డి, ఆర్ ఐ టైటాస్, ఏస్ ఐ సురేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.