రంపచోడవరంలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన
మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
విశాఖపట్నం మే 21,అనంత జనశక్తి న్యూస్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహస్థాపన ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబశుద్ధి కోసం
శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను మంత్రపూరితమైన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, ఆలయానికి, రాజగోపురానికి విమానకలశస్థాపన, విగ్రహస్థాపన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు మహా శాంతి, పూర్ణాహుతి, చతుర్దశ కలశస్నపనం, నవకలశస్నపనం, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 8 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు, రక్షాబంధనం, శయనాధివాసం, విశేష హోమాలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు
వేణుగోపాలదీక్షితులు, ఎస్ ఈ
సత్యనారాయణ,
విజివో
మనోహర్, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య,
శివప్రసాద్, డెప్యూటీ ఈఈలు ఆనంద రామ్, శ్రీ నాగభూషణం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం.మే 22న ఉదయం 5 గంటల నుండి 8.15 గంటల వరకు సుప్రభాతం , యాగశాల కైంకర్యాలు.
ఉదయం 8-15గంటల నుండి 8.45 గంటల వరకు మహా పూర్ణాహుతి.
ఉదయం 8-45 గంటల నుండి 9గంటల వరకు యాత్రదానం, కుంభ ప్రదక్షణ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు మిథున లగ్నంలో కళా వాహన , అక్షతా రోహణ, బ్రహ్మఘోష , మహా సంప్రోక్షణ.
ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం.
ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం.
సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం. తిరువీధి ఉత్సవం , ధ్వజావరోహణం.